ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నుంచి మెగాస్టార్ చిరంజీవికి పిలుపువచ్చింది. తెలుగు చిత్రసీమ సమస్యలను సీఎం జగన్ కు వివరించేందుకు అపాయింట్‌మెంట్‌ కోసం సినీప్రముఖులు వేచిచూస్తున్నారు. ఈ తరుణంలో సీఎం నుంచి పిలుపువచ్చిందని సమాచారం. ఈ నెల 20న మెగాస్టార్‌ చిరంజీవి నేతృత్వంలో నాగార్జున, దిల్‌ రాజు, సురేశ్‌బాబు ఇతరులు సీఎం జగన్ ను కలవనున్నారు. కరోనా కారణంగా తెలుగు చిత్రపరిశ్రమ ఎదుర్కొంటున్న సమస్యలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లేందుకు చిరంజీవి బృందం మంత్రి పేర్ని నాని ద్వారా కబురుపంపింది. మంత్రి పేర్ని నాని ఈ విషయాన్ని సీఎం జగన్‌కు తెలిపినట్లు సమచారం. త్వరలోనే వారితో సమావేశం అవుతానని మంత్రి పేర్ని నానితో సీఎం జగన్‌ అన్నట్లు తెలుస్తోంది. ఈ నెల 20న చిరంజీవి బృందాన్ని ఆహ్వానించమని మంత్రి పేర్ని నానికి సీఎం జగన్ చెప్పారు. ఈ సమాచారాన్ని మంత్రి, చిరంజీవికి చేరవేశారు.


Also Read: AP Degree Colleges Reopen: వచ్చే నెల 1 నుంచి డిగ్రీ తరగతులు.. అకడమిక్ క్యాలెండర్ విడుదల


ఈ విషయాలు చర్చించే అవకాశం


ఈ భేటీలో కొత్త సినిమాలకు బెనిఫిట్‌ షోలు వేసుకునేందుకు అవకాశం ఇవ్వాలని చిత్ర పరిశ్రమ పెద్దలు కోరనున్నారు. నగరాలు, పట్టణాల్లో రోజుకు నాలుగు షోలు ప్రదర్శించే అవకాశం కల్పించాలని, గ్రేడ్‌-2 కేంద్రాల్లో నేల టిక్కెట్టుకు పది రూపాయలు, కుర్చీకి 20 రూపాయలు వసూలు చేసే విధానాన్ని రాష్ట్రమంతా వర్తింపజేయవద్దని సీఎంను కోరనున్నట్లు సమాచారం. ఇటీవల ప్రభుత్వమే నేరుగా సినీ టిక్కెట్ల ఆన్ లైన్ లో విక్రయించేందుకు వెబ్ సైట్ తీసుకువస్తామని ప్రకటించింది. ఈ విషయంపై చిరంజీవి బృందం తమ అభిప్రాయాన్ని ముఖ్యమంత్రికి తెలిపే అవకాశం ఉంది. 


Also Read: Betel Leaf: రోజుకో రెండు తమలపాకులు నమలండి... ఈ రోగాలు దరిచేరవు


విశాఖలో సినీ పరిశ్రమ


ఏ,బీ,సీ సెంటర్లలో థియేటర్లు సినిమాల విడుదల వేళ ఇండస్ట్రీ కోరుకుంటున్న అంశాలు, విద్యుత్ ఛార్జీల్లో రాయితీలు వంటివి ప్రభుత్వం నుంచి మినహాయింపు కోరాలని సినీపెద్దలు నిర్ణయించారు. ఈ విషయాన్ని సీఎం వద్ద ప్రస్తావించనున్నారు. విశాఖలో సినీ పరిశ్రమ గురించి చర్చకు వచ్చే అవకాశం ఉంది. గతంలో చిరంజీవి రెండు సార్లు సీఎం జగన్ తో సమావేశమై చర్చలు చేశారు. రెండోసారి సమావేశమైన సమయంలో నాగార్జున, రాజమౌళి, దిల్ రాజు, సీ కళ్యాణ్, దగ్గుబాటి సురేష్ కూడా ఉన్నారు. మోహన్ బాబు, బాలకృష్ణకు ఆహ్వానించకపోవటంపై టాలీవుడ్ లో చర్చ జరిగింది.


Also Read: Allu Arjun: ఇది, బన్నీ అంటే.. ఒక్క దోశకు రూ.1000 చెల్లించిన అల్లు అర్జున్, ఉద్యోగం ఇస్తానని హామీ!