వినాయక చవితి రోజున థియేటర్లో సినిమా విడుదలకు చేసేందుకు అవకాశాలున్నా.. ‘టక్ జగదీష్’ నిర్మాతలు మాత్రం ఓటీటీలో విడుదల చేయడానికే మొగ్గు చూపారనే సంగతి మీకు తెలిసిందే. ‘అమెజాన్ ప్రైమ్’ ఓటీటీ సంస్థ భారీ మొత్తాన్ని చెల్లించి మరీ ఈ చిత్రాన్ని కొనుగోలు చేయడంతో నిర్మాతలు వేరే ఆలోచన చేయలేదు. అలాగే.. థియేటర్ యాజమాన్యం వినాయక చవితి రోజు ఈ చిత్రాన్ని విడుదల చేయొద్దని డిమాండ్ చేసినా పట్టించుకోలేదు. దీంతో ‘లవ్ స్టోరీ’ నిర్మాతలు వెనక్కి తగ్గలేదు. పండుగ రోజే చిత్రాన్ని విడుదల చేశారు. 


నాని, రీతూ వర్మ నటించిన ‘టక్ జగదీష్’ ఓటీటీలో విడుదల కావడం వల్ల అమెజాన్ ప్రైమ్ సబ్‌స్క్రైబర్లు అంతా వీక్షించేందుకు అవకాశం లభించింది. అయితే, తెలుగు రాష్ట్రాల్లో ఓటీటీ సబ్‌స్క్రిప్షన్ లేని చాలామందికి ఈ సినిమా చూసే అవకాశం లేదు. ఫలితంగా ప్రైవసీ మార్గాలను అన్వేషిస్తున్నట్లు తెలిసింది. ఈ విషయాన్ని పక్కన పెడితే.. ఈ సినిమాను ఓటీటీలో విడుదల చేయడం వల్ల నిర్మాతలు నష్టపోలేదనే చెప్పుకోవాలి. ఎందుకంటే.. సినిమా నిర్మాణానికి పెట్టిన ఖర్చు భర్తీ కావడమే కాకుండా అదనంగా మరో రూ.17.5 కోట్లు లభించినట్లు సమాచారం. 


Also Read: విశ్వ ఏమిటా ఏడుపు? ‘బిగ్ బాస్’ సీజన్ 5లో ‘పాతాళగంగ’ అవార్డుకు అబ్బాయిలు పోటీ?


విశ్వసనీయ సమాచారం ప్రకారం.. ‘టక్ జగదీష్’ చిత్రం మొత్తం బడ్జెట్ రూ.34 కోట్లు. ఈ సినిమా ప్రదర్శన హక్కుల కోసం ఓటీటీ రూ.37 కోట్లు చెల్లించినట్లు తెలిసింది. ఇది కాకుండా ఆడియో ద్వారా రూ.2 కోట్లు, హిందీ డబ్బింగ్ హక్కుల ద్వారా రూ.5 కోట్లు, శాటిలైట్ హక్కుల కింద రూ.7.5 కోట్లు లభించినట్లు సమాచారం. మొత్తం రూ.17.5 కోట్లు నిర్మాతలకు లభించినట్లు తెలిసింది. ఈ నేపథ్యంలో నిర్మాతలు వెచ్చించిన మొత్తం కంటే ఎక్కువే లభించినట్లు తెలుస్తోంది. అయితే, ఇదే చిత్రాన్ని నేరుగా థియేటర్లో విడుదల చేస్తే తక్కువ సమయంలోనే ఇంత లాభం వచ్చే అవకాశాలు తక్కువ ఉండేవని సినీవర్గాలు చెబుతున్నాయి. ఒక వేళ సినిమా హిట్ టాక్ తెచ్చుకుంటే.. ఇంతక కంటే ఎక్కువ ప్రాఫిట్ లభించే అవకాశాలున్నాయని అంచనా వేస్తున్నారు. అయితే, ఈ సినిమా యావరెజ్ టాక్ తెచ్చుకున్న నేపథ్యంలో ఒక విధంగా నిర్మాతలు సేఫ్ అని చెప్పుకోవచ్చు. అయితే, ఈ చిత్రాన్ని కొనుగోలు చేసిన ఓటీటీ సంస్థకు దీనివల్ల ఎంత లాభం వచ్చిందనేది మాత్రం తెలియరాలేదు. 


Also Read: అల్లు అర్జున్ సింప్లిసిటీ.. రోడ్డుపక్కన హోటల్‌లో టిఫిన్ తిన్న బన్నీ.. కాకినాడలో బిజీబిజీ