'విక్రమ్' విజయం తర్వాత తమిళ స్టార్ హీరో విజయ్ (Vijay) తో దర్శకుడు లోకేష్ కనగరాజ్ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. 'మాస్టర్' తర్వాత మరోసారి వాళ్ళు ఇద్దరూ కలిసి సినిమా చేస్తున్నారు. ఈ చిత్రాన్ని 7 స్క్రీన్ స్టూడియో సంస్థ నిర్మిస్తోంది. 'మాస్టర్', 'వారసుడు' తర్వాత విజయ్ హీరోగా ఆ సంస్థ నిర్మిస్తున్న మూడో చిత్రమిది. ఇది విజయ్ 67వ సినిమా. అందుకని, 'దళపతి 67' (Thalapathy 67) అని వర్కింగ్ టైటిల్ పెట్టారు.
విజయ్ జోడీగా త్రిష...
అదీ 14 ఏళ్ళ తర్వాత!
'దళపతి 67'లో విజయ్ జోడీగా త్రిష నటిస్తున్నారు. ఆల్రెడీ ఈ న్యూస్ ఎప్పుడో బయటకు వచ్చింది. ఈ రోజు ఆ విషయాన్ని చిత్ర బృందం అధికారికంగా వెల్లడించింది. తమిళంలో విజయ్, త్రిషది సూపర్ డూపర్ హిట్ జోడీ. సూపర్ స్టార్ మహేష్ బాబు 'ఒక్కడు' తమిళ రీమేక్ సహా 'కురివి', 'తిరుప్పాచ్చి', 'అతి' సినిమాల్లో వాళ్ళిద్దరూ నటించారు. 14 ఏళ్ళ విరామం తర్వాత మళ్ళీ విజయ్, త్రిష నటిస్తున్నారు.
'దళపతి 67'లో త్రిష రోల్ అదేనా?
లోకేష్ కానగరాజ్ సినిమాటిక్ యూనివర్స్ (LCU) లో 'దళపతి 67' కూడా ఒకటి. కార్తీ 'ఖైదీ', కమల్ హాసన్ 'విక్రమ్', సూర్య 'రోలెక్స్' క్యారెక్టర్లు, విజయ్ క్యారెక్టర్... అన్నీ ఈ కథలో భాగమే. డ్రగ్ మాఫియా, గ్యాంగ్‌స్టర్లు చుట్టూ కథ తిరుగుతుంది. ఇందులో త్రిష పాత్ర ఏమిటి? అని చాలా మందికి సందేహం కలుగుతోంది.
లోకేష్ కానగరాజ్ సినిమాల్లో హీరోయిన్లకు పెద్దగా ఇంపార్టెన్స్ ఉండదు. 'ఖైదీ'లో అసలు హీరోయినే లేదు. 'విక్రమ్'లో ఫహాద్ ఫాజిల్ జోడీగా ఒక అమ్మాయి ఉన్నారు. ఆమె పాత్ర మధ్యలో ముగిసింది. విలన్స్ చేతిలో మర్డర్ అవుతుంది. 'దళపతి 67'లో త్రిష రోల్ కూడా అదే విధంగా ముగుస్తుందని టాక్. విజయ్ గ్యాంగ్‌స్టర్ కావడానికి ముందు ఆమెతో ప్రేమలో పడతాడని, ఆ పాత్రను మర్డర్ చేయడం ద్వారా మధ్యలో లోకేష్ ముగిస్తాడని చెన్నై టాక్. ఇందులో నిజం ఎంత? అనేది త్వరలో తెలుస్తుంది.
త్రిషతో పాటు ఈ సినిమాలో మరో హీరోయిన్ ప్రియా ఆనంద్ కూడా ఉన్నారు. ఆమె పాత్ర ఏమిటి? అనేది ప్రస్తుతానికి సస్పెన్స్. ప్రస్తుతం సినిమాలో నటీనటుల వివరాలను వెల్లడిస్తున్నారు.
సంజయ్ దత్... అర్జున్...
లోకేష్ పెద్ద ప్లాన్ వేశారుగా!
'దళపతి 67'లో బాలీవుడ్ స్టార్ సంజయ్ దత్ నటిస్తున్నట్లు మంగళవారం అనౌన్స్ చేశారు. ఇంకా యాక్షన్ కింగ్ అర్జున్, దర్శకులు గౌతమ్ వాసుదేవ్ మీనన్, మిస్కిన్, నటుడు మన్సూర్ అలీ ఖాన్, మలయాళ నటుడు మాథ్యూ తదితరులు ఉన్నారు. నటీనటుల పేర్లు రివీల్ చేస్తుంటే... లోకేష్ కానగరాజ్ పెద్ద ప్లాన్ వేసినట్టు ఉన్నారు.
Also Read : స్టార్ హీరోలకు హిట్లు ఇచ్చిన బ్రహ్మానందం - ఆయన లేని ఈ సినిమాలను ఊహించుకోగలమా?
'దళపతి 67'కు రాక్‌స్టార్ అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్నారు. 'కత్తి', 'మాస్టర్', 'బీస్ట్' తర్వాత మరోసారి విజయ్ సినిమాకు ఆయన సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమాకు ఛాయాగ్రహణం : మనోజ్ పరమహంస, కూర్పు : ఫిలోమిన్ రాజ్, కళ : ఎన్. సతీష్ కుమార, యాక్షన్ : అన్బరివ్, ఎగ్జిక్యూటివ్ నిర్మాత : రామ్ కుమార్ బాలసుబ్రమణియన్, సహా నిర్మాత : జగదీష్ పళనిసామి.
Also Read : ఎవరీ ఆషిక? నందమూరి నయా నాయిక గురించి ఆసక్తికరమైన విషయాలు...