నిన్న జరిగిన మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ ఎన్నికల్లో మంచు విష్ణు ప్యానెల్ మెజారిటీను దక్కించుకుంది. అధ్యక్షుడిగా మంచు విష్ణు ఎన్నిక కాగా.. ఆయన ప్యానెల్ నుంచి పోటీ చేసిన సభ్యులు కూడా ఎక్కువ సంఖ్యలో విజయం సాధించారు. జనరల్ సెక్రటరీగా జీవితపై రఘుబాబు విజయం సాధించగా.. ట్రెజరర్ గా శివబాలాజీ.. నాగినీడుపై విజయం సాధించారు. ఇదిలా ఉండగా.. మంచు విష్ణు అధ్యక్షుడిగా ఎన్నికైన వెంటనే.. 'మా' సభ్యత్వానికి చాలా మంది సభ్యులు రాజీనామా చేయడం మొదలుపెట్టారు. ముందుగా.. నాగబాబు 'మా' సభ్యత్వానికి రాజీనామా చేశారు. 


Also Read: మా సభ్యత్వానికి ప్రకాష్ రాజ్ రాజీనామా.. తెలుగోడిగా పుట్టకపోవడం నా తప్పు కాదు! 


ఆ తరువాత ఈరోజు ఉదయాన్నే ప్రెస్ మీట్ నిర్వహించిన ప్రకాష్ రాజ్.. తను కూడా 'మా' సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ క్రమంలో ఆయన చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. ఇక తాజాగా శివాజీ రాజా కూడా 'మా' సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. కొన్ని రోజుల క్రితం ప్రెస్ మీట్ నిర్వహించిన శివాజీ రాజా.. మాజీ 'మా' అధ్యక్షుడు నరేష్ పై సంచలన ఆరోపణలు చేశారు. 


ఆయన ఎప్పుడూ అబద్ధాలు చెబుతూనే ఉంటారని.. ఆయన కారణంగానే 'మా' ఎన్నికల్లో ఇంత రచ్చ జరుగుతోందని.. వివాదాలన్నింటికీ కారణం ఆయనే అంటూ కామెంట్స్ చేశారు. ఈ ఎన్నికల్లో నరేష్.. మంచు విష్ణు ప్యానెల్ కి మద్దతుగా నిలిచిన సంగతి తెలిసిందే. పరోక్షంగా శివాజీరాజా.. ప్రకాష్ రాజ్ ప్యానెల్ కి మద్దతుగా పని చేశారు. కానీ ఫలితం లేకుండా పోయింది. ఈ విషయంలో ఆయనేం అనుకున్నారో ఏమో కానీ 'మా' సభ్యత్వానికి మాత్రం రాజీనామా చేశారు. 


Also Read: ‘మా’ మంచు విష్ణు విజయంపై సెలబ్రెటీల ట్వీట్స్.. అప్పుడు మాట్లాడలేదు.. ఇప్పుడు..


Also Read: అక్టోబరు 10 మంచు ఫ్యామిలీకి కలిసొచ్చిందా..అప్పుడు మోహన్ బాబు ఇప్పుడు మంచు విష్ణు..హిస్టరీ రిపీట్


Also Read: మంచు Vs మోనార్క్.. వీరి ప్యానళ్లలో ఎవరు గెలిచారు? ఎవరు ఓడారు?


Also Read: ‘మా’ ఎన్నికల్లో మెగా ఫ్యామిలీ రాంగ్ ఛాయిస్? చిరు - మోహన్ బాబు విభేదాలే రచ్చకు కారణమయ్యాయా?


Also Read: ‘మా’లో మంచు తుఫాన్.. ప్రకాష్ రాజ్ ఆ మాట అనకపోయి ఉంటే..


Also Read: విష్ణు విజయంపై మంచు లక్ష్మి, మనోజ్ ఏమన్నారంటే.. 


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి