శ్రియా శరన్, శివ కందుకూరి, ప్రియాంకా జవాల్కర్, నిత్యా మీనన్ ప్రధాన పాత్రల్లో నటించిన సినిమా 'గమనం'. సుజనా రావు దర్శకురాలిగా పరిచయం అవుతున్నారు. త్వరలో ఈ సినిమా తెలుగు వెర్షన్ ప్రేక్షకుల ముందుకు రానుంది. డిసెంబర్ 10న తెలుగు సినిమాను విడుదల చేయనున్నట్టు ఆదివారం ప్రకటించారు. తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో సినిమాను తెరకెక్కించినప్పటికీ... ముందుగా తెలుగు వెర్షన్ విడుదల చేసి, ఆ తర్వాత మిగతా వెర్షన్స్ విడుదల చేయాలని అనుకుంటున్నారు.
మూడు కథల సమాహారంగా 'గమనం' తెరకెక్కింది. ఇందులో శ్రియా శరన్ వినికిడి లోపం ఉన్న మహిళగా కనిపించనున్నారు. శివ కందుకూరి, ప్రియాంకా జవాల్కర్ జంటగా నటించారు. జాతీయస్థాయి క్రికెట్ జట్టులో ఆడాలని కలలు కనే యువ క్రికెట‌ర్‌గా శివ కందుకూరి కనిపించనున్నారు. అతనికి జంటగా ప్రియాంక కనిపించనున్నారు. శ్రియాది ఓ కథ... శివ-ప్రియాంక జోడీది మరో కథ అయితే... అనాథ బాలలుగా నటించిన ఇద్దరు చిన్నారులది ఇంకో కథ. హైదరాబాద్ నగరంలో భారీ వర్షాల వల్ల వీళ్ల జీవితాల్లో ఎటువంటి మార్పులు చోటు చేసుకున్నాయనేది సినిమా. సాయి మాధవ్ బుర్రా సంభాషణలు అందించిన ఈ సినిమాకు ఇళయరాజా సంగీతం అందించారు.
మూడు భిన్న కథలను ఒకే సినిమాలో చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. ఇందులో శ్రియా సరన్ ఓ కథలో అలరించనున్నారు. శివ కందుకూరి ప్రేమకథలో కనిపించనున్నారు. అనాథలు, స్లమ్ ఏరియా నేపథ్యంలో జరిగే కథలో ప్రియాంక జవాల్కర్ నటించారు. క్రియ ఫిల్మ్ కార్ప్, కలి ప్రొడక్షన్స్ బ్యానర్లపై రమేష్ కురుటూరి, వెంకీ పుష్పదపు, జ్ఞానశేఖర్ వి.ఎస్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు.


Also Read: యూర‌ప్‌లో ఎన్టీఆర్ హాలిడే... ఫ్యామిలీతో ట్రిప్ వేసిన యంగ్ టైగర్ ఎన్టీఆర్!
Also Read: సిరిని ఆటపట్టించిన రాజ్ తరుణ్.. యానీ, ప్రియాంకలలో ఎలిమినేట్ అయ్యేది ఎవరు..?
Also Read: 'ఈసారి కూడా మిస్ అవ్వదు..' పవన్ నిర్మాత కాన్ఫిడెన్స్ చూశారా..?
Also Read: అల్లు అర్జున్ తగ్గేదే లే... ఫుల్ స్వింగులో పుష్పరాజ్ డబ్బింగ్
Also Read: 'అఖండ' సినిమా సెన్సార్ పూర్తి... బాలకృష్ణ సినిమాకు ఏం సర్టిఫికెట్ వచ్చిందంటే?
Also Read: వరల్డ్స్ యంగెస్ట్ చెస్ ట్రైన‌ర్‌గా అల్లు అర్హ... రాయ్ చెస్ అకాడమీలో నోబెల్ వరల్డ్ రికార్డ్
Also Read: కైకాలను ఫోనులో పలకరించాను... కోలుకుంటారన్న పూర్తి నమ్మకం కలిగింది - చిరంజీవి
Also Read: ఓ ఇంటివాడైన యువ హీరో కార్తికేయ... పెళ్లికి హాజరైన మెగాస్టార్
ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి