పవన్ కళ్యాణ్, రానా కాంబినేషన్ లో తెరకెక్కుతోన్న చిత్రం 'భీమ్లా నాయక్'. మలయాళంలో సూపర్ హిట్ గా నిలిచిన 'అయ్యప్పనుమ్ కోశియుమ్' సినిమాకి రీమేక్ గా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై ఈ సినిమాను రూపొందిస్తున్నారు. సాగర్ చంద్ర డైరెక్ట్ చేస్తోన్న ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ పోలీస్ ఆఫీసర్ గా కనిపించనున్నారు. ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించిన పలు అప్డేట్స్ తో ఫ్యాన్స్ ను ఖుషీ చేస్తున్నారు దర్శకనిర్మాతలు. 


Also Read:రవిపై దారుణమైన ట్రోలింగ్.. ఫ్యామిలీను కూడా లాగుతూ..


సంక్రాంతి కానుకగా ఈ సినిమాను రిలీజ్ చేయాలనుకుంటున్నారు. అఫీషియల్ అనౌన్స్మెంట్స్ కూడా వచ్చేసింది. కానీ అదే సమయానికి 'ఆర్ఆర్ఆర్', 'రాధేశ్యామ్' లాంటి సినిమాలు విడుదలవుతుండంతో పవన్ సినిమా వాయిదా పడుతుందని అంతా అనుకున్నారు. రాజమౌళి రిక్వెస్ట్ చేసినా.. 'భీమ్లానాయక్' నిర్మాతలు తగ్గడం లేదని తెలుస్తోంది. రిలీజ్ డేట్ విషయంలో కాంప్రమైజ్ అయ్యేదే లేదని ఫిక్సయి కూర్చున్నారు.


అందుకే పలుమార్లు తమ సినిమా రిలీజ్ డేట్ ను ప్రకటిస్తూనే ఉన్నారు. సినిమాకి సంబంధించిన అప్డేట్ వస్తున్న ప్రతిసారి రిలీజ్ డేట్ ని నొక్కి చెబుతున్నారు. తాజాగా మరోసారి చిత్రనిర్మాత నాగవంశీ ఈ విషయాన్ని కన్ఫర్మ్ చేస్తూ ట్వీట్ చేశారు. 'REMEMBER THE WORD. ఈసారి కూడా మిస్ అవ్వదు.. 2022, జనవరి 12న థియేటర్లో కలుద్దాం' అని ఎడిటింగ్ రూమ్ లో ఉన్న ఫోటోను షేర్ చేశారు. దీనిపై పవన్ ఫ్యాన్స్ 'రెడీగా ఉన్నాం' అంటూ కామెంట్స్ చేస్తున్నారు. 


ప్రస్తుతం ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటుంది. ఈ సినిమాకి త్రివిక్రమ్ స్క్రీన్ ప్లే-మాటలు అందిస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో నిత్యామీనన్ హీరోయిన్ గా కనిపించనుంది. రానాకి భార్యగా నటి సంయుక్త మీనన్ కనిపించనుంది.






Also Read: అల్లు అర్జున్ తగ్గేదే లే... ఫుల్ స్వింగులో పుష్పరాజ్ డబ్బింగ్


Also Read: 'అఖండ' సినిమా సెన్సార్ పూర్తి... బాలకృష్ణ సినిమాకు ఏం సర్టిఫికెట్ వచ్చిందంటే?


Also Read: వరల్డ్స్ యంగెస్ట్ చెస్ ట్రైన‌ర్‌గా అల్లు అర్హ... రాయ్ చెస్ అకాడమీలో నోబెల్ వరల్డ్ రికార్డ్


Also Read: కైకాలను ఫోనులో పలకరించాను... కోలుకుంటారన్న పూర్తి నమ్మకం కలిగింది - చిరంజీవి


Also Read: ఓ ఇంటివాడైన యువ హీరో కార్తికేయ... పెళ్లికి హాజరైన మెగాస్టార్


Also Read: సోనుసూద్ సింప్లిసిటీ.. చిన్నారికి జడలు వేస్తూ.. రోటీలు చేస్తూ.. బిజీబిజీ


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి