స్టార్ హీరోయిన్ సమంతకి సోషల్ మీడియాలో ఉన్న ఫాలోయింగ్ గురించి తెలిసిందే. ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్ లలో ఈమెకి మిలియన్ల ఫాలోవర్లు ఉన్నారు. ఆమె ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్ల సంఖ్య 24 మిలియన్లకు దగ్గరగా ఉంటుంది. ఓ పక్క సినిమాల్లో బిజీగా ఉంటూనే మరోపక్క సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది ఈ బ్యూటీ. సమంత తను నటించే ఒక్కో సినిమాకి రూ.3 నుంచి 4 కోట్ల రేంజ్ లో రెమ్యునరేషన్ తీసుకుంటుంది.
లేడీ ఓరియెంటెడ్ సినిమాలైతే రూ.5 కోట్లు కూడా డిమాండ్ చేస్తుంది. ప్రస్తుతం వరుస సినిమాలు ఒప్పుకుంటూ బిజీగా మారింది. అలానే సోషల్ మీడియాలో తన ఫాలోయింగ్ ను క్యాష్ చేసుకుంటుంది. ఇన్స్టాగ్రామ్ లో బ్రాండ్స్ ను ప్రమోట్ చేస్తూ.. కోట్లు వెనకేసుకుంటుంది ఈ బ్యూటీ. రీసెంట్ గా ఈమె బికినీ ఫొటోలు బాగా వైరల్ అయ్యాయి. ఈ బికినీ బ్రాండ్ ను ప్రమోట్ చేయడానికి అమ్మడు భారీ మొత్తాన్ని రెమ్యునరేషన్ గా తీసుకుందట.
ఇంటర్నేషనల్ బ్రాండ్ Burberry ప్రొడక్ట్స్ ను ఇండియాలో కూడా బాగానే వాడతారు. ఈ బ్రాండ్ కి చెందిన స్విమ్ వేర్ ను ప్రమోట్ చేయడానికి ఒప్పుకుంది సమంత. ఈ స్విమ్ వేర్ ఖరీదు రూ.30,000. ఇదే బ్రాండ్ కు చెందిన బికినీను ధరించి తన ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేయడానికి సమంత రూ.90 లక్షలు పారితోషికం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఒక్క ఇన్స్టాగ్రామ్ పోస్ట్ తోనే తొంబై లక్షలు సంపాదించింది.
ఇలా నెలకి రెండు, మూడు బ్రాండ్ ను ప్రమోట్ చేస్తూ.. మూడు కోట్ల వరకు సంపాదిస్తుందని సమాచారం. సామ్ తరువాత టాలీవుడ్ లో ఆ రేంజ్ లో బ్రాండ్స్ ప్రమోట్ చేస్తోన్న హీరోయిన్లు రష్మిక, పూజాహెగ్డే. మొత్తానికి మన హీరోయిన్లు ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్లుగా బాగానే వెనకేసుకుంటున్నారు!
Also Read: మా సినిమా బ్రాహ్మణుల మనోభావాలను కించపరిచేలా ఉండదు - 'అంటే సుందరానికీ' దర్శకుడు వివేక్ ఆత్రేయ
Also Read: తెలుగు ఇండియన్ ఐడల్ గ్రాండ్ ఫినాలేకు మెగా టచ్, ఫైనల్ ఎపిసోడ్ చీఫ్ గెస్ట్ ఎవరో తెలుసా?