'అంటే సుందరానికీ'... నాని, నజ్రియా నజీమ్ జంటగా నటించిన సినిమా. జూన్ 10న విడుదల అవుతోంది. ఆ రోజు అనుపమ పరమేశ్వరన్ ఫస్ట్ షో చూసే అవకాశాలు ఉన్నాయి. ఆమె కోసం మొత్తం థియేటర్ బ్లాక్ చేశారట చిత్ర దర్శకుడు వివేక్ ఆత్రేయ.


ఇన్‌స్టాగ్రామ్‌లో ప్రేక్షకులు అడిగిన ప్రశ్నలకు వివేక్ ఆత్రేయ ఆన్సర్స్ ఇచ్చారు. ఆయనను అనుపమ పరమేశ్వరన్ కూడా ఒక క్వశ్చన్ అడిగారు. 'హాయ్ సార్... నేను మీ అభిమానిని. నా ఫస్ట్ షో ఫస్ట్ డే టికెట్స్ నా దగ్గరకు ఎప్పుడు వస్తున్నాయి?' అని! ''మేడమ్! ఫుల్ థియేటర్ మీ కోసం బ్లాక్ చేశాం'' అని వివేక్ ఆత్రేయ చెప్పారు. అదీ సంగతి!


Ante Sundaraniki movie doesn't hurt Brahmin's religious sentiments, Says director Vivek Athreya: 'ట్రైలర్ చూశాక బ్రాహ్మణుల మీద కామెడీ చేస్తున్నట్లు అనిపించింది. నిజమా? అబద్దమా?' అని ఒక నెటిజన్ ప్రశ్నించారు. అందుకు ''అబద్దం. 'అంటే సుందరానికీ' ఎవరి మనోభావాలు (మతపరమైన భావాలు ) కించపరిచేలా ఉండదు'' అని వివేక్ ఆత్రేయ బదులు ఇచ్చారు.


Also Read: మహేష్ బాబు సినిమాలో నాని - క్లారిటీ ఇచ్చిన హీరో

 
మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ ఎర్నేని, రవిశంకర్ .వై నిర్మించిన ఈ సినిమాలో నదియా, నరేష్, తులసి తదితరులు కీలక పాత్రల్లో నటించారు. జూన్ 9న ప్రీ రిలీజ్ వేడుక జరగనుంది. పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఆ వేడుకకు అతిథిగా వస్తున్నారు.


Also Read: సీక్రెట్‌గా హైదరాబాద్ చేరుకున్న సల్మాన్ - నెలరోజుల పాటు ఇక్కడే!