సూపర్ స్టార్ మహేష్ బాబు ఇటీవల 'సర్కారు వారి పాట' సినిమాతో భారీ విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నారు. ఇప్పుడు త్రివిక్రమ్ సినిమా కోసం సిద్ధమవుతున్నారు. త్వరలోనే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలుకానుంది. ఈ సినిమాలో పూజాహెగ్డే హీరోయిన్ గా కనిపించనుంది. అలానే పేరున్న టెక్నీషియన్స్ ఈ సినిమా కోసం పని చేయనున్నారు. ఇదిలా ఉండగా.. ఈ సినిమాకి సంబంధించిన ఓ వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. 

 

అదేంటంటే.. ఈ సినిమాలో సెకండ్ హీరోకి ఛాన్స్ ఉందని, దానికోసం త్రివిక్రమ్.. నేచురల్ స్టార్ నానిని సంప్రదించినట్లు వార్తలొచ్చాయి. నాని కూడా ఓకే చెప్పినట్లు మీడియాలో కథనాలు వచ్చాయి. వీటిపై తాజాగా నాని స్పందించారు. ప్రస్తుతం ఆయన నటించిన 'అంటే సుందరానికి' సినిమా విడుదలకు సిద్ధంగా ఉండడంతో ప్రమోషన్స్ లో బిజీ అయ్యారు నాని. 

 

ఈ క్రమంలో పలు ఇంటర్వ్యూలలో పాల్గొంటున్నారు. ఈ సందర్భంగా మహేష్ బాబు సినిమాలో నటిస్తున్నారా..? అనే ప్రశ్న నానికి ఎదురైంది. అది ఫేక్ న్యూస్ అని.. మహేష్ సినిమాలో తను నటించడం లేదని క్లారిటీ ఇచ్చారు నాని. దీంతో ఈ వార్తలకు ఫుల్ స్టాప్ పడింది. కొన్ని రోజుల క్రితం తారకరత్న ఈ సినిమాలో విలన్ గా కనిపించబోతున్నట్లు ప్రచారం జరగ్గా.. వాటిని ఖండించారు తారకరత్న. ఈ సినిమా మొదలుకాకుండానే.. ఇన్ని వార్తలు వినిపిస్తున్నాయి. మరి స్టార్ట్ అయితే ఇంకెన్ని గాసిప్స్ వస్తాయో!