తమిళంలో తెరకెక్కిన 'సుడల్' అనే వెబ్ సిరీస్ ను అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ చేయనున్నారు. తాజాగా ఈ సిరీస్ కి సంబంధించిన ట్రైలర్ ను విడుదల చేశారు. ఇదొక ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ డ్రామా. 'విక్రమ్ వేద' లాంటి హిట్టు సినిమాను రూపొందించిన పుష్కర్, గాయత్రి ఈ వెబ్ సిరీస్ కి స్టోరీ అందించారు. బ్రహ్మ ఈ సిరీస్ ను డైరెక్ట్ చేశారు. ఈ సిరీస్ ను జూన్ 17 నుంచి ప్రసారం చేయనున్నారు. 


దీంతో ప్రమోషన్స్ మొదలుపెట్టారు. ఈ క్రమంలో విడుదల చేసిన ట్రైలర్ సిరీస్ పై ఆసక్తిని పెంచుతుంది. ఒక చిన్న ఊరిలో నడిచే కథ ఇది. ఆ ఊరి స్కూల్ లో చదువుకునే అమ్మాయి కనిపించకుండా పోతుంది. ఆమెని వెతకడానికి ఇన్వెస్టిగేషన్ మొదలుపెడతారు. ఆ తరువాత మిస్సింగ్ కేస్ లో కొన్ని ఆసక్తికర విషయాలు తెలుస్తాయి. అవేవీ ట్రైలర్ లో చూపించకుండా జాగ్రత్త పడ్డారు. 


మిస్సింగ్ గర్ల్ సిస్టర్ క్యారెక్టర్ లో టాలెంటెడ్ బ్యూటీ ఐశ్వర్యారాజేష్ కనిపించింది. అలానే కథిర్, శ్రియా రెడ్డి, పార్తీబన్ కీలకపాత్రల్లో కనిపించారు. ఈ సిరీస్ ను తమిళంతో పాటు తెలుగు, హిందీ, మలయాళం, కన్నడ, ఇంగ్లీష్ ఇలా ముప్పైకి పైగా భాషల్లో విడుదల చేయనున్నారు. మరి ఈ సిరీస్ కి ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో చూడాలి!


Also Read: బాలకృష్ణకు జోడిగా నటించిన హీరోయినే ఇప్పుడు అనిల్ రావిపూడి సినిమాలో విలన్‌గా?