నట సింహం నందమూరి బాలకృష్ణ కథానాయకుడిగా హిట్ చిత్రాల దర్శకుడు అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఒక సినిమా రూపొందనున్న సంగతి తెలిసిందే. కమర్షియల్ సినిమాలకు కామెడీ యాడ్ చేసి... అనిల్ రావిపూడి భారీ బ్లాక్‌బ‌స్ట‌ర్‌ విజయాలు సాధించారు. అయితే, బాలకృష్ణ సినిమాతో ఆయన రూట్ మారుస్తున్నారు.
 
బాలయ్య లార్జర్ దేన్ లైఫ్ క్యారెక్టర్స్ చేస్తారు. ఆయనకు ఉన్న పవర్ ఫుల్ ఇమేజ్ అటువంటిది. ఆయన ఇమేజ్‌కు తగ్గ కథను అనిల్ రావిపూడి రెడీ చేశారట. తండ్రీ కుమార్తెల కథతో ఈ సినిమా రూపొందిస్తున్నట్లు దర్శకుడు చెప్పిన సంగతి తెలిసిందే. లేటెస్ట్ అప్ డేట్ ఏంటంటే... ఈ సినిమాలో లేడీ విలన్ రోల్ ఉందట. 


బాలకృష్ణ సరసన 'డిక్టేటర్' సినిమాలో నటించిన తెలుగమ్మాయి అంజలిని లేడీ విలన్ రోల్‌కు సెలెక్ట్ చేశారట. ఆమెకు పాత్ర గురించి వివరించారని, అది నచ్చడంతో పాటు బాలకృష్ణ సినిమా కాబట్టి వెంటనే ఓకే చేశారని సమాచారం. అంజలి రోల్ కూడా పవర్ ఫుల్ గా ఉంటుందట. జూలైలో రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. 


Also Read: టెన్త్ ఫెయిల్ అయిన మంత్రి గన్ బిల్ పాస్ చేస్తే? - లావణ్యా త్రిపాఠి 'హ్యాపీ బ‌ర్త్‌డే' టీజర్ చూశారా?






అనిల్ రావిపూడి సినిమా కంటే ముందు... గోపీచంద్ మలినేని దర్శకత్వంలో బాలకృష్ణ హీరోగా నటిస్తున్న సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా టైటిల్ ను బాలయ్య పుట్టినరోజు సందర్భంగా జూన్ 10న విడుదల చేయనున్నారు.


Also Read: ఇండియన్ రెస్టారెంట్‌లో హాలీవుడ్ నటుడు జానీ డెప్, ఒక్క నైట్ డిన్నర్‌కు 48 లక్షలు