'ఆయుధాల చట్టం అంటే ఏమిటి సుయోధనా?' - ఒకరు ప్రశ్న! 
'ఇంటింటికీ గన్ను... ఎదురులేని ఫన్ను' - ఇంకొకరు ఇచ్చిన సమాధానం 
- ఇవీ 'హ్యాపీ బ‌ర్త్‌డే' టీజర్ ప్రారంభంలో వినిపించిన డైలాగులు. మరి, టీజర్‌లో ఏముంది? అనేది తెలుసుకోవాలంటే అసలు వివరాల్లోకి వెళ్లాల్సిందే.


Lavanya Tripathi's Happy Birthday Movie Teaser: లావణ్యా త్రిపాఠి ప్రధాన పాత్రలో రూపొందుతోన్న సినిమా 'హ్యాపీ బర్త్ డే'. 'మత్తు వదలరా'తో ప్రేక్షకుల్ని ఆకట్టుకున్న రితేష్ రాణా, ఆ సినిమా తర్వాత దర్శకత్వం వహిస్తున్న చిత్రమిది. నరేష్ అగస్త్య, 'స్వామి రారా' సత్య, 'వెన్నెల' కిషోర్, గుండు సుదర్శన్ ఇతర పాత్రల్లో నటిస్తున్నారు. ఈ రోజు సినిమా టీజర్ విడుదల చేశారు. 


'హ్యాపీ బర్త్ డే' టీజర్ విషయానికి వస్తే... 'నేను టెన్త్ (పదో తరగతి) ఫెయిల్ అవ్వొచ్చు. కానీ, గన్ బిల్ మాత్రం పాస్ చేసి తీరుతా' అని చట్టసభలో 'వెన్నెల' కిషోర్ చేసే శపథం దృశ్యం మొదట వచ్చింది. మంత్రి రిత్విక్ సోది పాత్రలో ఆయన కనిపించనున్నారు. ఆయన ప్రతిపాదించిన ఆయుధాల సవరణ చట్టం ఆమోదించబడింది. ఆ తర్వాత గల్లీ గల్లీలో తుపాకీల అమ్మకాలు ప్రారంభం అవుతారు. ఆ తర్వాత ఒక ప‌బ్‌లో లావణ్యా త్రిపాఠిని చూపించారు. ప‌బ్‌లో ఆమె గన్ ఫైరింగ్ చేయడం గట్రా ఆసక్తికరంగా ఉన్నాయి. 'నాకు ఈ ఆలోచన ఎందుకు వచ్చిందని ఆలోచించే బదులు మీకు ఎందుకు రాలేదని సిగ్గు పదండి' అని 'వెన్నెల' కిషోర్ చెప్పే మాటతో టీజర్ ముగిసింది.


Also Read: ఇండియన్ రెస్టారెంట్‌లో హాలీవుడ్ నటుడు జానీ డెప్, ఒక్క నైట్ డిన్నర్‌కు 48 లక్షలు



జూలై 15న 'హ్యాపీ బర్త్ డే' సినిమా విడుదల కానుంది. నవీన్ ఎర్నేని, రవిశంకర్ యలమంచిలి సమర్పణలో మైత్రీ మూవీ మేకర్స్, క్లాప్ ఎంట‌ర్‌టైన్‌మెంట్స్‌ పతాకాలపై చిరంజీవి (చెర్రీ), హేమలత పెదమల్లు చిత్రాన్ని నిర్మిస్తున్నారు. కాల భైరవ సంగీతం అందిస్తున్నారు. 


Also Read: శర్వానంద్ సినిమాలో రాశీ ఖన్నాతో పాటు ప్రియమణి కూడా - అసలు కథ ఏంటంటే?