ఈ మధ్యకాలంలో విడుదలైన సినిమాల్లో 'డీజే టిల్లు' సినిమా బెస్ట్ ఎంటర్టైనర్ గా నిలిచింది. చిన్న సినిమాగా విడుదలై భారీ విజయాన్ని నమోదు చేసుకుంది. నిర్మాతలకు రెండింతల లాభాలు తీసుకొచ్చింది. ఈ సినిమాతో యంగ్ హీరో సిద్ధూ జొన్నలగడ్డకి మంచి బ్రేక్ వచ్చింది. తెరపై సిద్ధూ తన పెర్ఫార్మన్స్ తో ఆకట్టుకున్నా.. తెరవెనుక మాత్రం తన దర్శకత్వ ప్రతిభతో ఆకట్టుకున్నారు విమల్ కృష్ణ.
'డీజే టిల్లు' సినిమాను డైరెక్ట్ చేయడంతో పాటు రచయితగా కూడా పని చేశారు విమల్ కృష్ణ. ఈ సినిమాతో తన టాలెంట్ ను నిరూపించుకున్న విమల్ కృష్ణకి కొంతమంది హీరోలు, నిర్మాతల నుంచి పిలుపు వస్తుందట. ఈ యంగ్ డైరెక్టర్ ను పిలిపించుకొని మరీ కథను వింటున్నారట హీరోలు, నిర్మాతలు. ఇటీవల నాగచైతన్యను కలిసి కథ వినిపించారట విమల్ కృష్ణ. ఈ స్టోరీ చైతుకి బాగా నచ్చిందట.
ప్రస్తుతం చైతు-విమల్ కృష్ణల మధ్య కథా చర్చలు సాగుతున్నట్లు సమాచారం. ఒక్కసారి కథ లాక్ అయితే ప్రీ ప్రొడక్షన్ పనులు మొదలుపెట్టాలని చూస్తున్నారు. కానీ ప్రస్తుతం చైతు చాలా బిజీగా ఉన్నారు. 'థాంక్యూ' సినిమా విడుదలైన వెంటనే పరశురామ్ తో ఓ సినిమా మొదలుపెట్టనున్నారు. అలానే 'బొమ్మరిల్లు భాస్కర్ తో సినిమా ఉంటుందని సమాచారం. వీటితో పాటు మరో రెండు, మూడు కథలు ఫైనల్ చేశారు. వీటన్నింటి మధ్య విమల్ కృష్ణతో సినిమా ఎప్పుడు మొదలుపెడతారో చూడాలి!
Also Read: బాలకృష్ణకు జోడిగా నటించిన హీరోయినే ఇప్పుడు అనిల్ రావిపూడి సినిమాలో విలన్‌గా?