బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్, అతడి తండ్రి సలీమ్ ఖాన్ లను చంపేస్తామంటూ కొందరు దుండగులు బెదిరింపులకు పాల్పడ్డారు. పంజాబ్ సింగర్ సిద్ధూకి పట్టిన గతే మీకు కూడా పడుతుందని లెటర్ పంపించారు. ఈ లెటర్ తో అప్రమత్తమైన సల్మాన్ ఖాన్.. బాంద్రా పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు మొదలుపెట్టారు. గ్యాంగ్‌స్టర్‌ లారెన్స్‌ బిష్ణోయ్‌.. సల్మాన్ ను చంపేస్తామంటూ 2018లో కొన్ని కామెంట్స్ చేశారు. 


దీనికి సంబంధించిన వీడియో ఇటీవల బయటకొచ్చింది. వారే ఇప్పుడు సల్మాన్ ని బెదిరిస్తున్నట్లు టాక్. అలర్ట్ అయిన పోలీసులు సల్మాన్ కి భారీ భద్రత ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో భారీ భద్రత నడుమ సల్మాన్ ఖాన్ సీక్రెట్ గా హైదరాబాద్ చేరుకున్నట్లు తెలుస్తోంది. ఓ సినిమా షూటింగ్ కోసం ఆయన హైదరాబాద్ వచ్చినట్లు తెలుస్తోంది. 


సల్మాన్ నటిస్తోన్న లేటెస్ట్ సినిమా 'కభీ ఈద్ కభీ దివాలీ'. ఫర్హాద్ సామ్‌జి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తోంది. అలానే టాలీవుడ్ సీనియర్ నటుడు వెంకటేష్ కీలకపాత్ర పోషిస్తున్నారు. ఇప్పుడు ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్‌లోని రామోజీ ఫిలిం సిటీలో జరగనుంది. దాదాపు నెలరోజుల పాటు ఈ షెడ్యూల్ సాగనుంది. ఈ షెడ్యూల్ లో సల్మాన్ తో పాటు పూజాహెగ్డే, వెంకటేష్ కూడా పాల్గోనున్నారు. బెదిరింపులు వచ్చినప్పటికీ.. వాటికి భయపడకుండా సల్మాన్ తన సినిమాల షూటింగ్స్ ను పూర్తి చేస్తున్నారు. 


Also Read: 'సుడల్' ట్రైలర్ - అమెజాన్ లో ఇంట్రెస్టింగ్ వెబ్ సిరీస్


Also Read: 'డీజే టిల్లు' డైరెక్టర్ తో నాగచైతన్య సినిమా?