ఇప్పుడు నయనతారను కుమారి అనాలి. ఎందుకంటే... ఆమెకు పెళ్లి కాలేదు కనుక! నయన్ పేరు ముందు కుమారి అనేది మరి కొన్ని గంటలు మాత్రమే ఉంటుంది. రేపు (గురువారం, జూన్ 9న) ఉదయం ఎనిమిది గంటల తర్వాత కుమారి నుంచి శ్రీమతిగా మారతారు.


తమిళ దర్శకుడు విఘ్నేష్ శివన్, నయనతార వివాహం గురువారం ఉదయం తమిళనాడులోని మహాబలిపురంలో జరగనుంది. పెళ్లికి కొన్ని గంటల ముందు వెడ్డింగ్ ఇన్విటేషన్ (శుభలేఖ) నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఆ పెళ్లి కార్డును మీరూ చూడండి.


Also Read: కత్రీనా కైఫ్ - విక్కీ కౌశల్ పెళ్ళికి నయనతార - విఘ్నేష్ శివన్ పెళ్ళికి లింక్ ఏంటంటే?






 
నయన్ - దర్శకుడు విఘ్నేష్ శివన్ పెళ్లికి తమిళనాడు ముఖ్యమంత్రి ఎం.కె. స్టాలిన్, ఆయన కుమారుడు ఉదయనిధి స్టాలిన్ సహా పలువురు సినిమా కొంత మంది సినిమా ప్రముఖులు హాజరు కానున్నారు. కుటుంబ సభ్యులు, అతి కొద్దీ మంది సన్నిహితులను మాత్రమే పెళ్ళికి ఆహ్వానించారు.


Also Read: నయనతారను తిరుపతిలో ఎందుకు పెళ్లి చేసుకోవడం లేదో చెప్పిన విఘ్నేష్ శివన్