Vignesh Shivan Nayanthara Wedding: నయనతారను తిరుపతిలో ఎందుకు పెళ్లి చేసుకోవడం లేదో చెప్పిన విఘ్నేష్ శివన్

విఘ్నేష్ శివన్, నయనతార త్వరలో పెళ్లి చేసుకోనున్న సంగతి తెలిసిందే. తమ వివాహ విషయాన్ని ప్రెస్‌మీట్‌ పెట్టి విఘ్నేష్ శివన్ వెల్లడించారు. ఇంకా ఆయన ఏమన్నారంటే... 

Continues below advertisement

పెళ్లి మండపంలో అడుగు పెట్టడానికి రెండు రోజుల ముందు మీడియా ముందుకు వచ్చారు దర్శకుడు విఘ్నేష్ శివన్ (Vignesh Shivan). లేడీ సూపర్ స్టార్, తెలుగు - తమిళ భాషల్లో అగ్ర కథానాయికగా స్టార్ స్టేటస్ ఎంజాయ్ చేస్తున్న నయనతార (Nayanthara) తో కొన్ని రోజులుగా ఆయన ప్రేమలో ఉన్న విషయం ప్రతి ఒక్కరికీ తెలిసిందే. జూన్ 9న ఈ ప్రేమ జంట పెళ్లి పీటలు ఎక్కుతోంది.

Continues below advertisement

పెళ్లి చేసుకోబోతున్న విషయం వెల్లడించడానికి విఘ్నేష్ శివన్ ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు. ''నా వ్యక్తిగత జీవితంలో తర్వాత దశకు చేరుకున్నా. జూన్ 9న నా జీవితంలో ప్రేమ దేవత నయనతారను పెళ్లి చేసుకోబోతున్నా. కుటుంబ సభ్యులు, కొంత మంది స్నేహితుల సమక్షంలో వివాహ వేడుక జరగనుంది'' అని విఘ్నేష్ శివన్ తెలిపారు.

Why Nayanthara Vighnesh Shivan Wedding Venue Changed?: ''తొలుత తిరుపతి గుడిలో పెళ్లి చేసుకోవాలని అనుకున్నాం. అయితే, కొన్ని కారణాల వల్ల కుదరలేదు. మా తల్లిదండ్రులను గుడికి తీసుకు రావడం కూడా కష్టం. అందుకే, పెళ్లి వేదిక తిరుపతి నుంచి మహాబలిపురానికి మారింది'' అని చెప్పారు. 

పెళ్ళికి ముందు రిసెప్షన్ ఇవ్వనున్నట్టు వార్తలు వచ్చాయి. అయితే, దాని గురించి విఘ్నేష్ శివన్ చెప్పలేదు. జూన్ 11న మాత్రం మీడియా ముందుకు వస్తామని చెప్పారు. జూన్ 9వ తేదీ మధ్యాహ్నం పెళ్లి ఫోటోలు విడుదల చేయనున్నారు. ఈ పెళ్లిని గౌతమ్ మీనన్ నేతృత్వంలో బృందంతో షూట్ చేయించి... ఓటీటీలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్టు సమాచారం. పెళ్ళికి రావాల్సిందిగా తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ ను కలిసి ఆహ్వానించిన సంగతి తెలిసిందే. 

Also Read: రజనీకాంత్ - నెల్సన్ దిలీప్ కుమార్ సినిమాలో ఐశ్వర్యా రాయ్ రోల్ ఏంటంటే?

తన ప్రేమ గురించి నయన్ ఎప్పుడూ మాట్లాడింది లేదు. విఘ్నేష్ శివన్ చేతుల మీదుగా అవార్డు తీసుకోవాలని ఉందని పట్టుబట్టి... ఒక వేడుకలో అతడి చేతుల మీదుగా అవార్డు తీసుకుంది. అప్పటి నుంచి తన చేతల ద్వారా ప్రేమను వ్యక్తం చేస్తూ ఉంది.

Also Read: టెన్త్ ఫెయిల్ అయిన మంత్రి గన్ బిల్ పాస్ చేస్తే? - లావణ్యా త్రిపాఠి 'హ్యాపీ బ‌ర్త్‌డే' టీజర్ చూశారా? 

Continues below advertisement
Sponsored Links by Taboola