Sonakshi Sinha: 'ఐ లవ్ యు' చెప్పినప్పుడు లేని ఇబ్బంది పెళ్లి అంటే ఎందుకు వచ్చింది సోనాక్షీ?

సోనాక్షీ సిన్హా తన ప్రేమ కహాని బయట పెట్టారు. అయితే, పెళ్లి అంటూ వచ్చిన వార్తలపై మాత్రం వ్యంగ్యంగా స్పందించారు.

Continues below advertisement

అవును... సోనాక్షీ సిన్హా ప్రేమలో ఉన్నారు. ఎవరితోనో తెలుసా? హిందీ నటుడు జహీర్ ఇక్బాల్‌తో! కొన్ని రోజులుగా ముంబైలో వినబడుతున్న సంగతే ఇది. కొత్తది ఏమీ కాదు. మరి, కొత్త ఏంటి? అంటే... పబ్లిక్‌గా ఒకరికి ఒకరు ఐ లవ్యూ చెప్పుకోవడం! ఒక విధంగా జహీర్‌తో తన రిలేషన్షిప్‌ను కన్ఫర్మ్ చేశారని చెప్పుకోవాలి. 

Continues below advertisement

జహీర్ ఇక్బాల్, సోనాక్షీ సిన్హా ప్రేమలో ఉన్నారని కొన్ని రోజులుగా ముంబై సినిమా జనాలు చెబుతున్నారు. అయితే, ఎవరూ పబ్లిక్‌గా కన్ఫర్మ్ చేయలేదు. సోమవారం సోనాక్షి పుట్టినరోజు సందర్భంగా జహీర్ వీడియో, ఫోటోలు ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు. బర్త్ డే విషెష్ చెప్పడంతో పాటు 'ఐ లవ్ యు' అని కూడా పేర్కొన్నారు. అతడి పోస్ట్ కింద సోనాక్షీ సిన్హా కూడా 'ఐ లవ్ యు' అని చెప్పారు. దాంతో అందరికీ ఒక క్లారిటీ వచ్చింది. అయితే... ముంబై మీడియాలో వాళ్ళిద్దరికీ పెళ్లి అని కూడా వార్తలు వచ్చాయి. వాటిపై సోనాక్షీ సిన్హా వ్యంగ్యంగా స్పందించారు. 

Also Read: మా సినిమా బ్రాహ్మణుల మనోభావాలను కించపరిచేలా ఉండదు - 'అంటే సుందరానికీ' దర్శకుడు వివేక్ ఆత్రేయ

ఇన్‌స్టాగ్రామ్‌లో సోనాక్షీ సిన్హా ఒక వీడియో పోస్ట్ చేశారు. ''ప్రపోజల్, రోకా, మెహందీ, సంగీత్... అన్నీ ఫిక్స్ చేసేసినట్టు అయితే నాకు చెప్పండి'' అని పేర్కొన్నారు. ఆ వీడియోలో ''నాకు పెళ్లి చేయాలని మీరు ఎందుకు అంత మొండిగా ఉన్నారు?'' అని మీడియాను ప్రశ్నించారు. తర్వాత మీడియా ఆమెకు సమాధానం ఇస్తున్నట్లుగా మరో షారుఖ్ ఖాన్ డైలాగ్ చెప్పారు... ''మాకు మంచిగా అనిపిస్తుంది. చాలా సరదాగా ఉంటుంది'' అని!  ఆ వీడియోపై జహీర్ ఇక్బాల్ లాఫింగ్ ఎమోజీలు పోస్ట్ చేశారు. 

Also  Read: తెలుగు ఇండియన్ ఐడల్ గ్రాండ్ ఫినాలేకు మెగా టచ్, ఫైనల్ ఎపిసోడ్ చీఫ్ గెస్ట్ ఎవరో తెలుసా?

Continues below advertisement
Sponsored Links by Taboola