Ennallo Vechina Hrudayam Today Episode త్రిపుర పెన్ కనిపించడం లేదని చెప్పడంతో బాల, త్రిపుర కలిసి మొత్తం వెతుకుతారు. ఇళ్లంతా వెతికినా పెన్ దొరకదు. త్రిపుర తండ్రి ఫొటో అక్కడే ఉంటుంది కానీ బాల చూడడు. ఇంతలో రమాప్రభ, ఊర్వశి వస్తే పెన్ గురించి త్రిపుర అడుగుతుంది. రమాప్రభ తెలీదు అనేస్తుంది. పెన్ మిస్ అయిందనే కోపంతో బాల గోడని కొడతాడు. ఆ ఫైర్‌లో త్రిపుర తండ్రి ఫొటో కింది పడిపోతుంది. అక్కడే ఉన్న పెన్‌ని బాల చూస్తాడు.
పెన్ కనిపించడంతో హ్యాపీగా ఫీలవుతాడు. రామప్రభ, ఊర్వశిలు టెన్షన్ పడతారు. బాల వాళ్లకి థ్యాంక్స్ చెప్పి పెన్ తీసుకొని వెళ్తాడు. ఇంట్లో వాసుకి, నాగభూషణం, ఫణిలు చాలా టెన్షన్ పడతారు. బాల ఇంటికి రావడం చూసి బాల చేతిలో పెన్ చూసి వణికిపోతారు. బాల లోపలికి వెళ్లి అనంత్‌ని ల్యాప్ ట్యాప్ తీసుకురమ్మని చెప్పి దాన్ని కనెక్ట్ చేసి చూస్తాడు. మన పని అయిపోయిందని మన పని ఇక జైలే అని నాగభూషణం టెన్షన్ పడతాడు. తాతయ్య చావుకి కారణం అయిన వాళ్లని వదలను అని బాలా అంటాడు.
పెన్‌లో ఉన్న పెన్‌డ్రైవ్‌ని ల్యాప్ ట్యాప్‌లో పెట్టి చూస్తాడు. అయితే పెన్‌లో ఉన్న డేటా అంటా పోయింటుంది. ఇందులో ఏ ఆధారంలేదు అని బాల డిసప్పాయింట్ అవుతాడు. ఈ పెన్ కెమెరాలో సాక్ష్యాలు ఉన్నాయని తాతయ్య చెప్పారు ఇందులో ఏం లేవని బాల టెన్షన్ పడతాడు. ఇంట్లో అందరూ బాలని నచ్చచెప్పే ప్రయత్నం చేస్తారు. టెన్షన్‌లో బాల తల పట్టుకొని ఇబ్బంది పడతాడు.
త్రిపుర ఇంటికి వెళ్లిన నాగభూషణం, వాసుకిని కాళ్ల మీద కాళ్లు వేసుకొని కూర్చొంటే రమాప్రభ వాళ్లతో మీ కళ్లలో భయం పోయి క్రూరత్వం కనిపిస్తుందని అంటుంది. పెన్ సంగతి మర్చిపోయారా అని అడుగుతుంది. దాంతో వాసుకి పెన్ చూపించి ఇందులో ఏం లేదని మాకు తెలిసిపోయిందని అంటుంది. రమాప్రభ ఏం తెలీనట్లు నటిస్తుంది. ఊర్వశి కూడా ఓవర్ చేస్తుంది. దాంతో వాసుకి ఇక నుంచి మేం ఏం చెప్తే మీరు దానికి తలూపాలి లేదంటే మేం తల తీసేస్తాం అంటారు. రమాప్రభ వాళ్లతో ఆ పెన్ కెమెరాలో ఉన్న ఆధారాలు అన్నీ మా ఫోన్‌లోకి ఎక్కించాం. తర్వాత పెన్‌లో డిలీట్ చేసేశాం అని చెప్తారు. భార్యభర్తలు ఇద్దరూ తెగ టెన్షన్ పడతారు. ఇక నుంచి మీరు చెప్పినట్లు వింటామని చెప్పి వెళ్లబోతే త్రిపురని చూసి దాక్కోంటారు.
ఊర్వశి ఆ ఆధారాలు మనకు ఎందుకు అని అడిగితే నిన్ను ఆ ఇంటికి కోడలిని చేసే ఆధారాలు అవే అంటుంది. ఎలా కోడలిని అవుతాను అని ఊర్వశి అడిగితే ఫణి ఉన్నాడు కదా అని అంటుంది. ఊర్వశి షాక్ అయిపోతుంది. బాల చిన్న పిల్లాడిలా ఉండిపోతే వాడికి పెళ్లి అవ్వదు. అనంత్, గాయత్రీలను మనం విడదీసేస్తాం అప్పుడు ఆ ఇంటికి ఉన్న ఏకైక వారసుడు ఫణీనే కదా ఆ ఫణితో నీకు పెళ్లి చేస్తే ఆ ఇంటి యువరాణివి నువ్వే అని అంటుంది. ఊర్వశి కూడా హ్యాపీగా ఫీలవుతుంది.
బాల ఇంకా పెన్ గురించే ఆలోచిస్తాడు. అందులో సాక్ష్యం లేకపోవడం ఏంటి ఏదో జరిగి ఉంటుందని అంటాడు. తాతయ్య చావుకి కారణం అయిన వాళ్ల మీద కేసు పెట్టలేదా అని గాయత్రీ అడుగుతుంది. దాంతో అనంత్ కేసు పెట్టామని ముగ్గురు నిందితుల్ని విచారించారని బాలకి డిటైల్స్ చెప్తాడు. ఇక త్రిపుర కేసు ఫైల్ చేసిన పోలీస్ స్టేషన్‌కి వెళ్దామని అంటుంది. బాల, త్రిపుర పోలీస్ స్టేషన్‌కి వెళ్తారు. అంతా ఫణి చాటుగా వింటాడు. ఇద్దరూ పోలీస్ స్టేషన్‌కి వెళ్లి కేసు డిటైల్స్ అవుతారు. కానిస్టేబుల్‌ని పంపి స్టోర్ రూంలో ఫైల్ వెతకమని అంటాడు. బాల, త్రిపుర వెళ్తారు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.
Also Read: నువ్వుంటే నా జతగా సీరియల్: మీ నాన్నని చంపేస్తావా మిధున.. వెళ్లిపో ఇక్కడి నుంచి: మిధునని గెంటేసిన త్రిపుర
Also Read: నువ్వుంటే నా జతగా సీరియల్: మీ నాన్నని చంపేస్తావా మిధున.. వెళ్లిపో ఇక్కడి నుంచి: మిధునని గెంటేసిన త్రిపుర