Seethe Ramudi Katnam Serial Today Episode రామ్ ఆవేశంగా ఇంటికి వస్తాడు. అందరూ ఏమైందని అడుగుతారు. దాంతో రామ్ తనని మిథున ఇబ్బంది పెట్టిందని మిథునతో కలిసి బిజినెస్ ట్రిప్‌కి వెళ్లాలని అంటాడు. మహాలక్ష్మీ,అర్చనలు మంచిదే కదా మన బిజినెస్ కోసమే కదా అంటారు. 

రామ్: ఇది బిజినెస్ ట్రిప్‌లా లేదు నాతో కలిసి మిథున వేసిన పర్సనల్ ట్రిప్‌లా ఉంది. గౌతమ్: అలా అయితే లక్కీ ఛాన్స్ కొట్టేశావ్ బ్రో నాకు అలాంటి ఛాన్స్ వస్తే అస్సలు వదులుకోను. రామ్: అయితే నువ్వు వెళ్లురా నేను మానేస్తే. మిథున కావాలనే నా వెంట పడుతుంది పిన్ని. అస్సలు తనని భరించలేను.చలపతి: మిథున మనసులో ఏం ఉన్నా నువ్వు క్లారిటీగా ఉన్నావ్ కదా.రామ్: నాకు నచ్చని వాళ్లు నా వెంట పడితే నాకు నచ్చదు మామయ్య. ఒక్కోసారి నాకు అనిపిస్తుంది సీతని అనవసరంగా ఇంటి నుంచి పంపేశానా అని. చలపతి: అది ముమ్మాటికీ తప్పే అల్లుడు.మహాలక్ష్మీ: సీత తప్పు చేసింది రామ్ పంపేశాడు అందులో తప్పేముంది.చలపతి: తప్పు చేసిన అందరినీ పంపలేదు కదా క్షమించి వదిలేశాం కదా.రామ్: కరెక్ట్ మామయ్య నేను వీలైనంత త్వరగా సీతని క్షమించి ఇంటికి తీసుకొస్తా. తన మీద పడిని నింద తొలగిపోనంత వరకు  సీత రాను అంది. అదేదో ఇక్కడే ఉండి నిరూపించుకోమని సీతకి చెప్పి తీసుకొస్తా. ఈ బిజినెస్ డీల్ అవ్వగానే సీతని తీసుకొస్తా.అర్చన: ఏంటి మహా మనం రామ్, మిథునల్ని కలపాలి అనుకుంటే రామ్ సీతని ఇంటికి తీసుకొస్తా అంటున్నాడు. మిథునని వదులుకుంటే వేల కోట్లు నష్టం వస్తుంది. మహాలక్ష్మీ: ఇంటి వరకు వచ్చిన ఐశ్వర్యాన్ని ఎలా వదుకులుకుంటాం అర్చన. ఎలా అయినా ఆస్తి మనదే.అర్చన: గౌతమ్ రేఖని ప్రేమించి చచ్చాడు. రామ్ మిథున వద్దు అంటున్నాడు మరెలా మహా. కొంపతీసి నీకు గౌతమ్‌లా మరొ కొడుకు ఉన్నాడా.మహాలక్ష్మీ: నీకు ఎలా కనిపిస్తున్నాను. నాకు కన్నకొడుకు గౌతమ్ పెంచిన కొడుకు రామ్ తప్ప మరెవరూ లేరు. ఎలా అయినా మిథునని రామ్‌కి ఇచ్చి పెళ్లి చేస్తాను. రామ్ మిథునతో వెళ్లడం మనకు మంచి ఛాన్స్. రేపటి నుంచి వాళ్లిద్దరూ గంటల కొద్ది కలిసి ఉంటారు. వాళ్లు ఒక్కటి అయితే సీత వేరవుతుంది కదా.అర్చన: అది అసాధ్యం మహా. రామ్ భార్య సీత మీద కొన్నాళ్లు చేయి వేయలేదు ఇక మిథున అంటే ఇష్టం లేకుండా ఎలా ఉంటాడు.మహాలక్ష్మీ: అది మిథున టాలెంట్ మీద ఆధారపడి ఉంటుంది. మిథునని కలుద్దాం పద.

అర్చన, మహాలక్ష్మీలు మిథునని కలుస్తారు. రామ్‌కి రాత్రి పాలు తాగే అలవాటు ఉంది రామ్‌కి పాలు ఇచ్చేటప్పుడు మత్తు మందు కలుపు మీరు ఒక్కటి అయితే మేం తెల్లారాక కథ నడిపిస్తామని చెప్తుంది. మిథున నవ్వి మంచి ప్లాన్ బాగుంది నేను రెడీ అని అంటుంది. మరి సీత అంటే సీత గురించి వదిలేయ్ మేం చూసుకుంటాం అని అంటారు. నీ ఐడియా సూపర్ ఇలాంటి ఐడియాలు ఎలా వచ్చాయ్ అంటే ఇంతకు ముందు మహా చాలా ప్లాన్స్ చేసిందని అన్నీ అర్చన చెప్పేస్తుంది. గౌతమ్ మహా కొడుకు అని చెప్పబోతే మహాలక్ష్మీ ఆపేస్తుంది. మహాలక్ష్మీ వాళ్ల మాటలు రేఖ చాటుగా వింటుంది.  సీతని సైడ్ చేయడానికి మహాలక్ష్మీ అత్తయ్య ఇంత పెద్ద స్కెచ్ వేసిందా ఈ విషయం వెంటనే గౌతమ్‌కి చెప్పాలి అనుకుంటుంది.

మహాలక్ష్మీకి నీ మీద ప్రేమ లేదని తన ప్రేమ అంటే తన సవతి కొడుకు రామ్‌ మీదే పెడుతుందని అంటుంది. మా అమ్మకి నేనే ఇష్టం అని చెప్తాడు. అంత లేదు అని మహాలక్ష్మీ, మిథునల ప్లాన్ చెప్తుంది. గౌతమ్ షాక్ అయిపోతాడు. మిథున ఈ ఇంటికి వస్తే మనం పని వాళ్లు అవుతాం అంటుంది. మిథునకు ఉన్న ఆస్తి నాకు లేదు. రామ్ ఈ ఇంటికి వారసుడు అన్నట్లు నువ్వు మహాలక్ష్మీ కొడుకు అని ఆవిడ చెప్పదు అంటుంది. ఈ ప్రాబ్లమ్‌కి సొల్యూషన్ ఏంటి అని గౌతమ్ అంటే రామ్‌ని లేకుండా చేద్దామని అంటుంది. రామ్ లేకపోతే నువ్వు ఈ ఇంటికి వారసుడు అవుతావ్ అప్పుడు ఆస్తి మనదే అవుతుంది అని చెప్తుంది. మనం అదే రిసార్ట్‌కి వెళ్లి రామ్ పని ముగించుకొని వచ్చేద్దామని అనుకుంటారు. సీత బట్టలు సర్దుతుంటే రేవతి, కిరణ్‌లు వెళ్తారు. సీత బిజినెస్ ట్రిప్ గురించి చెప్తుంది. మహాలక్ష్మీ ప్లాన్ గురించి చెప్తుంది. అంత నీచంగా ప్లాన్ చేసిందా అని రేవతి అంటుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.

Also Read: నువ్వుంటే నా జతగా సీరియల్: మీ నాన్నని చంపేస్తావా మిధున.. వెళ్లిపో ఇక్కడి నుంచి: మిధునని గెంటేసిన త్రిపుర