జనవరి 7... ఈ తేదీ కోసం సినీ అభిమానులంతా ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. ఆ రోజునే ప్రపంచవ్యాప్తంగా ఆర్ఆర్ఆర్ మూవీ విడుదల కాబోతోంది. భారీ బడ్జెట్ తో, భారీ తారాగణంతో తెరకెక్కిన ఈ సినిమాపై అంచనాలు మామూలుగా లేవు. అందులోనూ బాహుబలి తరువాత జక్కన్న తెరకెక్కించిన సినిమా... ఇక మూవీ లవర్స్ ఎంతగా ఆ సినిమా కోసం ఎదురుచూస్తారో చెప్పక్కర్లేదు. ఈ సినిమా విడుదలయ్యాక ఎన్నో రికార్డులు బద్దలవుతాయని, కొత్త రికార్డులను సృష్టిస్తుందని అందరు భావించారు, కానీ ఈ సినిమా విడుదలవ్వక ముందే రికార్డులను సృష్టించడం మొదలుపెట్టింది. 


అమెరికాలో ఈ సినిమా ప్రీబుకింగ్స్ మొదలైపోయాయి. ప్రస్తుతం తక్కువ థియేటర్లలోనే ఈ సినిమాను విడుదల చేయాలనుకున్నారు. కానీ ప్రీబుకింగ్స్ కోసం ఎగబడుతున్న జనాన్ని చూసి థియేటర్లను పెంచాలని భావిస్తున్నారట. అమెరికాలోని సినీ మార్క్, రీగల్, ఇమాజిన్ థియేటర్లలో తరచూ తెలుగు సినిమాలు విడుదలవుతుంటాయి. ఆ థియేటర్లలో ఇప్పటికే 9 లక్షల డాలర్ల విలువైన టిక్కెట్లు అమ్ముడైపోయాయి. ఇంతవరకు ఏ సినిమాకూ పదిహేను రోజుల ముందే ఈ రేంజిలో ప్రీ బుకింగ్స్ జరుగలేదు. సినిమా విడుదలకు రెండు వారాల సమయం ఉంది కాబట్టి... ఇంకా ప్రీ బుకింగ్స్ పెరిగే అవకాశం ఉంది. అంటే ప్రీ బుకింగ్స్ లో పెద్ద రికార్డే సృష్టించబోతోంది ఆర్ఆర్ఆర్. 


అమెరికాలో ఉన్న తెలుగు అభిమానులే ఇలా స్పందిస్తుంటే ఇక తెలుగు రాష్ట్రాల్లో పరిస్థితి అంచనా వేయడం కూడా కష్టమే. ఆ రోజున థియేటర్లు కిటకిటలాడతాయని ఆశిస్తున్నారు థియేటర్ ఓనర్లు. కరోనా కారణంగా వెలవెలబోయిన థియేటర్లు ఆర్ఆర్ఆర్ తో తిరిగి కళకళలాడతాయని వారి ఆశ. ఇప్పటికే అఖండ సినిమా ప్రజలను థియేటర్లకు రప్పించింది. ఇప్పుడు ఆర్ఆర్ఆర్ సినిమాతో మళ్లీ హౌస్ ఫుల్ బోర్డులు కనిపించే అవకాశం ఉంది. ఆర్ఆర్ఆర్ మానియా మామూలుగా లేదు మరి.


Also Read: సమంతకు అండగా రంగంలోకి దిగిన ఫ్రెండ్... భావోద్వేగ పోస్టు
Also Read: థియేటర్ కంటే కిరాణా కొట్టు పెట్టుకోవడం బెటర్... ఏపీ ప్రభుత్వం మీద నాని సెటైర్స్
Also Read: అది నా ఇష్టం! మీ క్యారెక్ట‌ర్ సంగ‌తేంటి?... సైలెంట్‌గా క్లాస్ పీకిన అన‌సూయ‌!
Also Read: శ్రీరామ చంద్ర కాళ్లు చూస్తే కన్నీళ్లు ఆగవు... ఎంత పని చేశావ్ 'బిగ్ బాస్'!
Also Read: కొమురం భీముడో... కొమురం భీముడో... ఎన్టీఆర్ సాంగ్ ప్రోమో వచ్చింది! చూశారా?
Also Read: 'భీమ్లా నాయక్' వాయిదా పడింది... నాగార్జున దూకుడు పెరిగింది!
ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి