విశాఖపట్నం జిల్లాలో మత్య్సకారుల వలకు వేల్ షార్క్ చిక్కింది. ఈ వేల్ షార్క్ 50 అడుగుల పొడవు, రెండు టన్నుల బరువు ఉంటుందని మత్య్సకారులు తెలిపారు. విశాఖ జిల్లా అచ్యుతాపురం మండలం తంతాడి గ్రామం సముద్రతీరంలో ఈ పెద్ద చేప  మత్స్యకారులకు చిక్కింది. భారీ చాపను చూసి అటవీశాఖ సిబ్బందికి సమాచారం అందించడంతో వారు అక్కడికి చేరుకున్నారు. మత్స్యకారులు అటవీశాఖ సిబ్బంది సహాయంతో వేల్ షార్క్ ను సముద్రంలోకి వదిలేశారు.



Read Also: ఏడవండి.. గట్టిగా ఏడ్చి మీ బాధను తగ్గించుకోండి, కొత్తగా ఏడుపు గదుల ప్రాజెక్ట్


సురక్షితంగా సముద్రంలోకి


వేల్ షార్క్ తంతాడి బీచ్ లో మత్య్సకారుల వలకు చిక్కిందని విశాఖ జిల్లా అటవీశాఖ అధికారి అనంత శంకర్ తెలిపారు. వేల్ షార్క్ ను సురక్షితంగా తిరిగి సముద్రంలోకి పంపామని ఆయన చెప్పారు.
'వేల్ షార్క్ ను చాలా కష్టపడి తిరిగి సముద్రంలోనికి పంపగలిగాం. మత్య్సకారులు, అటవీశాఖ సిబ్బంది, వైల్డ్ లైఫ్ సంరక్షకులతో కలిసి చాలా శ్రమించి 2 టన్నుల బరువున్న వేల్ షార్క్ ను తిరిగి సముద్రం లోపలకు పంపించగలిగాం. మా ప్రయత్నం విజయవంతం అయింది.' అని శంకర్ అన్నారు.  


Read Also: ‘కిమ్’ కర్తవ్యం?.. ఉత్తర కొరియా నియంత భార్యకు ఇన్ని రూల్సా? పిల్లలను కనే విషయంలోనూ..


మత్య్సకారుల వలలకు పరిహారం అందజేస్తాం


ఈ షార్క్ ను గుర్తించడం కోసం ఫొటోలను మాల్దీవుల వేల్ షార్క్ పరిశోధకులతో పంపించామని అటవీ శాఖ అధికారులు తెలిపారు. ఎందుకంటే సున్నితమైన సముద్ర జీవుల కదలికలు గుర్తించడానికి ఇవి సహాయపడతాయన్నారు. వేల్ షార్క్ కదలికలను అర్థం చేసుకోవడానికి ఈ సమాచారం ఉపయోగపడుతోందన్నారు. ఈ సంఘటన తరువాత స్థానిక మత్స్యకారులకు పలు సలహాలు చేశారు అటవీశాఖ అధికారులు. సముద్ర జీవులను రక్షించడానికి, సురక్షితంగా సముద్రంలో విడుదల చేయడానికి అటవీ శాఖను సంప్రదించాలని కోరారు. చేపల వేటలో వేల్ షార్క్‌లు చిక్కుకుపోతే మత్స్యకారులకు వేల్ షార్క్‌లను విడిచిపెట్టడానికి చేపల వలలకు ఏదైనా నష్టం జరిగితే పరిహారం అందజేస్తామని అటవీశాఖ అధికారి అనంత్ శంకర్ తెలిపారు. 


Read Also: ప్రియుడు మాట్లాడటం లేదని పోలీసులకు ప్రియురాలు ఫిర్యాదు.. పెళ్లి చేసి తిక్క


శాన్ డియాగో లో పసిఫిక్ ఫుట్ బాల్ ఫిష్ 


కొన్ని వారాల క్రితం శాన్ డియాగో ప్రాంతంలోని టోరే పైన్స్‌లోని బ్లాక్స్ బీచ్‌లో ఒక వ్యక్తి 'డీప్ సీ మాన్ స్టార్' అనే సముద్రపు జీవిని గుర్తించారు. నవంబర్ 13వ తేదీ సాయంత్రం బీచ్‌లో నడుచుకుంటూ వెళుతుండగా, భయంకరంగా కనిపించే ఒక చేప తనకు కనిపించిందని జే బీలర్ చెప్పాడు. దూరం నుంచి చూసిన బీలర్ ఆ జీవిని జెల్లీ ఫిష్‌గా భావించాడు. కానీ అతను దగ్గరగా వచ్చినప్పుడు అతను ఇంతకు ముందెన్నడూ చూడని పూర్తిగా భిన్నమైనదని అతను గ్రహించాడు. అతను ఆ జీవి మూడు ఫోటోలను తీశాడు. ఆ ఫోటోలను నెట్ లో పెడితే అది పసిఫిక్ ఫుట్‌బాల్ ఫిష్ అని తేలింది. 


Also Read: వీడియో: వామ్మో.. కొప్పులో పాము, ఆమె జడను చూసి జడుసుకున్న జనం


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి