దగ్గుబాటి రానా, సాయి పల్లవి ప్రధాన పాత్రల్లో నటించిన సినిమా 'విరాటపర్వం'. ఈ సినిమాను వేణు ఊడుగుల డైరెక్ట్ చేశారు. సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై ఈ సినిమాను తెరకెక్కించారు. గతేడాది వేసవిలో రావాల్సిన ఈ సినిమా కరోనా కారణంగా వాయిదాల మీద వాయిదా పడింది. ఫైనల్ గా జూన్ 17న సినిమాను రిలీజ్ చేయబోతున్నట్లు అనౌన్స్ చేశారు. ఇప్పటికే విడుదల చేసిన ఈ సినిమా ట్రైలర్ అంచనాలను ఓ రేంజ్ లో పెంచేసింది. 

 

సాయిపల్లవి, రానాల పెర్ఫార్మన్స్ ను వెండితెరపై చూడడానికి ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాపై ఉన్న బజ్ కి తగ్గట్లే బిజినెస్ కూడా బాగా జరిగింది. రెండు తెలుగు రాష్ట్రాలు, ఓవ‌ర్సీస్ లలో కలిపి ఈ సినిమాకు రూ.14 కోట్ల మేర‌కు ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగినట్లు తెలుస్తోంది. నైజాంలో రూ. 4 కోట్లు, సీడెడ్ లో రూ. 2 కోట్లు, ఆంధ్రలో రూ. 5 కోట్లు బిజినెస్ అయింది.

 

అంటే రెండు తెలుగు రాష్ట్రాల్లోనే రూ.11 కోట్ల వరకు బిజినెస్ జ‌రిగింది. ఇక క‌ర్ణాట‌క‌, రెస్టాఫ్ ఇండియా కలుపుకొని కోటి రూపాయ‌లు, ఓవ‌ర్ సీస్‌లో రూ.2 కోట్ల మేర‌కు ప్రీ రిలీజ్ బిజినెస్ జ‌రిగినట్లు తెలుస్తోంది. అంటే ఓవరాల్ గా రూ.14 కోట్లు బిజినెస్ జ‌రిగింది. సినిమా హిట్ కావాలంటే అంతకుమించి కలెక్షన్స్ ను సాధించాల్సి ఉంటుంది. ఈ సినిమాపై ఉన్న బజ్ కి భారీ ఓపెనింగ్స్ రావడం ఖాయం. సినిమాకి హిట్ టాక్ వస్తే గనుక కచ్చితంగా మొదటివారంలోనే బ్రేక్ ఈవెన్ అయిపోతుంది. పైగా ఈ సినిమాతో పోటీగా సరైన సినిమా ఏదీ రిలీజ్ కావడం లేదు. అది కూడా 'విరాటపర్వం'కి కలిసొచ్చే విషయం.