కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ ప్రధాన పాత్రలో తెలుగులో ఓ సినిమా రాబోతుంది. చాలా కాలంగా ఆయన తెలుగులో స్ట్రెయిట్ సినిమా చేస్తారని వార్తలొచ్చాయి. ఫైనల్ గా దిల్ రాజు ఈ ప్రాజెక్ట్ ని సెట్ చేశారు. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో ఈ సినిమాను రూపొందిస్తున్నారు. ఇందులో రష్మికను హీరోయిన్ గా తీసుకున్నారు. ఇప్పటికే ఈ సినిమా పూజా కార్యక్రమాలను నిర్వహించారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ దశలో ఉంది. ఇటీవల ఈ సినిమా స్పాట్ నుంచి కొన్ని ఫొటోలు లీక్ అయ్యాయి. అవి సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యాయి.  


ఇదిలా ఉండగా.. ఈ సినిమా కోసం 'వారసుడు' అనే టైటిల్ ను పరిశీలిస్తున్నట్లు సమాచారం. గతంలో ఇదే పేరుతో నాగార్జున హీరోగా సినిమా వచ్చింది. ఇప్పుడు ఈ టైటిల్ ను విజయ్ సినిమాకి పెట్టాలనుకుంటున్నారు. తమిళంలో వేరే టైటిల్ ను ఫిక్స్ చేయనున్నారు. జూన్ 22న విజయ్ పుట్టినరోజు సందర్భంగా టైటిల్ ను అనౌన్స్ చేయనున్నారు. దాదాపు 'వారసుడు'నే ఫైనల్ చేసే ఛాన్స్ ఉందని అంటున్నారు. 


ఇక ఈ సినిమాలో చాలా మంది పేరున్న నటీనటులను తీసుకున్నట్లు తెలుస్తోంది. కోలీవుడ్ నుంచి ప్రభు, శరత్ కుమార్ లాంటి సీనియర్ ఆర్టిస్ట్ లను రంగంలోకి దించారు. అలానే జయసుధ, ప్రకాష్ రాజ్ లను ఎంపిక చేసుకున్నట్లు కొన్ని రోజుల క్రితం అనౌన్స్ చేశారు. వీరితో పాటు శ్రీకాంత్, సంగీత లాంటి నటులు కూడా ఈ సినిమాలో కనిపించనున్నారు. 


కోలీవుడ్ టాలెంటెడ్ కమెడియన్ యోగిబాబుని తీసుకున్నట్లు మొన్నామధ్య ప్రకటించారు. ఈ సినిమాలో విజయ్ పాత్ర చాలా డిఫరెంట్ గా ఉంటుందని చెబుతున్నారు. దళపతి 66వ చిత్రంగా రాబోతోన్న ఈ ప్రాజెక్ట్‌ను తమిళ, తెలుగు భాషల్లో తెరకెక్కిస్తున్నారు. ఈ ఏడాది 'బీస్ట్' సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విజయ్ ఆశించిన స్థాయిలో సక్సెస్ అందుకోలేకపోయారు. మరి ఈ సినిమాతోనైనా సక్సెస్ అందుకుంటారేమో చూడాలి!


Also Read: కశ్మీర్ లో పండిట్స్ ను చంపారు, ఇక్కడ ముస్లింను కొట్టారు - సాయిపల్లవి వ్యాఖ్యలపై నెటిజన్లు ఫైర్!


Also Read: ప్రభాస్ హ్యాండ్సమ్ లుక్ - వైరలవుతోన్న ఫొటోలు