టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకున్న సాయిపల్లవి 'విరాటపర్వం' ప్రమోషన్స్ లో బిజీగా ఉంది. పలు ఇంటర్వ్యూలలో పాల్గొంటున్న ఆమె ఆసక్తికర విషయాలను పంచుకుంటుంది. రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో కశ్మీర్ పండిట్ల మారణహోమం గురించి మాట్లాడింది సాయిపల్లవి. ముందుగా ఆమె 'విరాటపర్వం' సినిమాలో తన క్యారెక్టర్ గురించి చెబుతూ.. నక్సల్స్ గురించి మాట్లాడింది. నక్సల్స్ కి ఒక ఐడియాలజీ ఉంటుందని.. కానీ వయిలెన్స్ అనేది తనకు తప్పుగా అనిపిస్తుందని చెప్పింది. 


వాళ్లకి(నక్సల్స్) ఆ సమయంలో ఎలా ఎక్స్ ప్రెస్ చేయాలి..? తమ కష్టాలను ఎవరు వింటారు..? ఎవరి దగ్గరకి వెళ్లాలి..? ఇలా ఏం చేయాలో తెలియక.. అందరూ కలిసి గ్రూప్ గా మారారు. మంచి చేయాలనే అలా మారారు. అయితే వాళ్లు చేసింది తప్పా..? కరెక్టా..? అని చెప్పే కాలంలో మనం లేమని చెప్పింది సాయిపల్లవి. తనకు వయిలెన్స్ అనేది నచ్చదని.. అర్ధం కూడా కాదని.. అన్నీ న్యూట్రల్ గా చూసే ఫ్యామిలీలో పెరిగానని.. అందుకే ఎవరు రైట్..? ఎవరు రాంగ్..? అని చెప్పలేనని తెలిపింది. 


అందరూ మంచి మనుషుల్లా ఉండాని.. ఎవరో ఎవరినో హర్ట్ చేస్తున్నారని.. మనం కూడా అలా చేయకూడదని.. బాధితుల గురించి ఆలోచించాలని చెప్పింది. కొన్ని రోజుల క్రితం వచ్చిన 'కశ్మీర్ ఫైల్స్' అనే సినిమాలో కశ్మీర్ పండిట్లను ఎలా చంపారో చూపించారు. ఇప్పుడు మనం మత సంఘర్షణలా వాటిని చూస్తే.. ఈమధ్య ఓ ముస్లిం డ్రైవర్ తన బండిలో ఆవుని తీసుకెళ్తుండగా.. కొంతమంది అతడిని కొట్టి, చంపేసి జైశ్రీరామ్ అన్నారు.. అప్పుడు కశ్మీర్ లో జరిగిన దానికి ఇప్పుడు జరిగిన దానికి తేడా ఎక్కడ ఉంది..? అని ప్రశ్నించింది సాయిపల్లవి.


మతాలు కాదు.. మంచి మనుషులుగా ఉండాలని సూచించిన సాయిపల్లవి. అయితే ఇప్పుడు ఆమె చేసిన ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. సాయిపల్లవిని దారుణంగా ట్రోల్ చేస్తున్నారు. చరిత్ర తెలియకుండా.. ఇలాంటి కామెంట్స్ చేయకంటూ ఆమెపై మండిపడుతున్నారు. మరి దీనిపై సాయిపల్లవి ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి!


Also Read: డిజిటల్ తెరపై రాజ్ తరుణ్, శివానీ రాజశేఖర్ పెళ్ళంట


Also Read: విజయ దశమికి థియేటర్లలో చిరంజీవి వర్సెస్ బాలకృష్ణ? ఆ రెండు సినిమాల మధ్య పోటీ?