పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ముంబైలో దర్శకుడు ఓం రౌత్ ఇంటి వద్ద కనిపించారు. ఆయన దర్శకత్వంలో 'ఆదిపురుష్' సినిమాలో నటిస్తున్నారు ప్రభాస్. ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించిన షూటింగ్ కూడా పూర్తయింది.ఈ సినిమాలో ప్రభాస్ శ్రీరాముడిగా నటించడంతో ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఎప్పుడెప్పుడు ఈ సినిమా చూద్దామా అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటుంది. 


ఇదిలా ఉండగా.. 'ఆదిపురుష్' టీమ్ కోసం తన ఇంట్లో పార్టీ హోస్ట్ చేశారు దర్శకుడు ఓం రౌత్. దీనికి ప్రభాస్ కూడా వచ్చారు. ఆయనతో పాటు సైఫ్ అలీ ఖాన్, కృతిసనన్, సన్నీ సింగ్ ఇలా టీమ్ మొత్తం హాజరైంది. ఈ సందర్భంగా ప్రభాస్ కి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. నిన్నమొన్నటి వరకు కండలు తిరిగిన దేహంతో కనిపించారు ప్రభాస్. 


ఇప్పుడు చాలా సన్నగా కనిపిస్తున్నారు. ఫార్మల్స్ వేసుకొని స్లిమ్ లుక్ లో కనిపించారు ప్రభాస్. ఈ ఫొటోలు చూసిన అభిమానులు ప్రభాస్ చాలా హ్యాండ్సమ్ గా ఉన్నారంటూ కామెంట్స్ చేస్తున్నారు. 'ఆదిపురుష్'లో ఇదే లుక్ తో ప్రభాస్ కనిపిస్తారని సమాచారం. ఇక 'ఆదిపురుష్' సినిమా విషయానికొస్తే.. మోషన్ క్యాప్చర్ టెక్నాలజీతో తెరకెక్కిస్తున్న ఈ సినిమాను సుమారు 500 కోట్ల రూపాయల నిర్మాణ వ్యయంతో తీస్తున్నారట.  


టీసిరీస్ అధినేత భూషణ్ కుమార్ నిర్మాత. ఇందులో సీత పాత్రలో కృతి సనన్, లక్ష్మణుడిగా సన్నీ సింగ్, లంకేశ్ పాత్రలో హిందీ హీరో సైఫ్ అలీ ఖాన్ నటించిన సంగతి తెలిసిందే. ఈ సినిమాను హిందీ, సౌత్ భాషలతో పాటు ఇంగ్లీష్ లో కూడా రిలీజ్ చేయనున్నారు. 


Also Read: డిజిటల్ తెరపై రాజ్ తరుణ్, శివానీ రాజశేఖర్ పెళ్ళంట


Also Read: విజయ దశమికి థియేటర్లలో చిరంజీవి వర్సెస్ బాలకృష్ణ? ఆ రెండు సినిమాల మధ్య పోటీ?