అది 'విరాట పర్వం' కాదు, 'వివాదాల పర్వం' అని... దర్శకుడు వేణు ఊడుగులతో క్రియేటివ్ డిఫరెన్స్ రావడంతో సంగీత దర్శకుడు సురేష్ బొబ్బిలి సినిమా నుంచి తప్పుకొన్నారనేది కొందరు చెబుతున్న మాట. సురేష్ బొబ్బిలిని తప్పించి... అతడి స్థానంలో తమిళ సంగీత దర్శకుడు సామ్ సిఎస్‌ను తీసుకున్నారని ఆ కథనాల సారాంశం. వీటిపై హీరో రానా దగ్గుబాటి స్పందించారు. సినిమా నుంచి సంగీత దర్శకుడు వాకవుట్ చేశారని వార్తలపై రానా రెస్పాండ్ అయ్యాడు. "ఎవడు బ్రో నీకు చెప్పింది. నీ సోది" అని ట్వీట్ చేశారు. దాంతో 'విరాట పర్వం' దర్శకుడు, సంగీత దర్శకుడు మధ్య ఎటువంటి గొడవలు లేవనేది స్పష్టమైంది.


మావోయిస్టు నేపథ్యంలో దర్శకుడు వేణు ఊడుగుల 'విరాట పర్వం' చిత్రాన్ని తెరకెక్కించారు. సినిమాలో 'కోలు కోలు... కోలోయమ్మ' పాటను కరోనా సెకండ్ వేవ్ కంటే ముందు విడుదల చేశారు. ఆ పాటకు యూట్యూబ్‌లో 11 మిలియన్ వ్యూస్ వచ్చాయి. ముఖ్యంగా సురేష్ బొబ్బిలి సంగీతం, చంద్రబోస్ సాహిత్యానికి  శ్రోతల నుంచి ప్రసంశలు వచ్చాయి. వేణు ఊడుగుల తొలి సినిమా 'నీదీ నాదీ ఒకే కథ'కు కూడా సురేష్ బొబ్బిలి సంగీతం అందించారు. 'విరాట పర్వం' తర్వాత వేణు ఊడుగుల నేతృత్వంలో రూపొందనున్న ఓ వెబ్ సిరీస్‌కు సైతం సురేష్ బొబ్బిలి సంగీతం అందించనున్నారట. ఇద్దరి మధ్య మంచి సఖ్యత ఉందని 'విరాట పర్వం' యూనిట్ సన్నిహితులు నుండి అందుతున్న సమాచారం.


Also Read: ప్రజెంట్ 'గాడ్ ఫాదర్'... 15 నుంచి 'భోళా శంకర్'... మెగాస్టార్ స్పీడు మామూలుగా లేదుగా!


'విరాట పర్వం'లో రానాకు జోడీగా సాయి పల్లవి నటించారు. నందితా దాస్, ప్రియమణి, నవీన్ చంద్ర, జరీనా వాహబ్, ఈశ్వరి రావు, సాయి చంద్ వంటి భారీ తారాగణం సినిమాలో ఉన్నారు. నివేదా పేతురాజ్ అతిథి పాత్రలో నటించారు. కరోనా సెకండ్ వేవ్ కంటే ముందు సినిమా రెడీ అయ్యింది. సరైన సమయం చూసుకుని విడుదల చేయాలని అనుకుంటున్నారు. 


Also Read: సంక్రాంతి బరిలో రాజ'శేఖర్'... యాంగ్రీ స్టార్ తగ్గేదే లే!


Also Read: 'ఆర్ఆర్ఆర్' గ్లింప్స్‌లో ఇవి గ‌మ‌నించారా!? 


Also Read: ఆర్ఆర్ఆర్... బ్రదర్ & బావా... 45 సెకన్లలో ఎలా?


Also Read: కాజల్ మేడమ్... ఇద్దరూ కలిసి తాగుతున్నారా!? తాగి తాగి సచ్చిపోండి!


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి