హృతిక్ రోషన్ , టైగర్ ష్రాఫ్ లాంటి వాళ్లు యాక్షన్ మూవీస్ చేసి, తమ శరీరాలు ప్రదర్శిస్తారు. కానీ మహిళలు ఎందుకలా చేయలేరు. ఇదేనా లింగ సమానత్వం అని క్వశ్చన్ చేశాడు రామ్ గోపాల్ వర్మ. ఇలాంటి ప్రశ్న ఇంకెవరినుంచైనా వచ్చిఉంటే ఎవరికైనా చూపించండ్రా బాబూ అనేవారం. కానీ ఈ ట్వీట్ చేసింది ఆర్జీవీ కదా అందుకే నెటిజన్లు అలవాటు పడిపోయారు. ఇంతకీ ఇంత మాట ఎందుకన్నాడంటే పూజా భాలేకర్ చేసిన ట్వీట్ ని రీట్వీట్ చేసి ఇలా రియాక్టయ్యాడన్నమాట.
పూజా ఏమందంటే.. టైగర్ ష్రాఫ్, హృతిక్ రోషన్ లాంటి యాక్షన్ హీరోల్లా కష్టపడి సంపాదించిన నా ఫిట్ నెస్ చూసి నేను గర్వపడుతున్నా అంది. ఎందుకంటే స్త్రీ అంతిమ ఆయుధం స్త్రీ అని..అందులో ఆమె ఇంద్రియాలకు సంబంధించిన అంశాలు కూడా ఉన్నాయని నమ్ముతున్నానని ట్వీట్ చేసింది. ఈ ట్వీట్ ని రీట్వీట్ చేసిన వర్మ..సమానత్వం ఇదేనా అని ప్రశ్నించాడు.
ఈ మధ్యకాలంలో వర్మ తెరకెక్కించే చిత్రాలకి అంతగా ఆదరణ దక్కకపోయినా తాజాగా ఓ అద్భుతం జరిగింది. ఇండియాలోనే ఫస్ట్ మార్షల్ ఆర్ట్స్ సినిమా అంటూ ‘లడికి’ అనే సినిమా రూపొందించాడు ఆర్జీవీ. లడ్‌కీ: ఎంటర్ ది గర్ల్ డ్రాగన్ పేరుతో ఈ సినిమా వస్తోంది. ఈ సినిమాను FOSHAN KUNG FU FILM FESTIVAL లో నవంబర్ 27న ప్రీమియర్ చేస్తున్నారు. బ్రూస్ లీ జయంతి సందర్భంగా చైనాలో జరగనున్న సెలబ్రేషన్స్ లో ఈ మూవీ ప్లే చేస్తున్నారు. ఇందులో హీరోయిన్ పూజా భలేకర్. ఇప్పటికే విడుదలైన హిందీలో ట్రైలర్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. ‘ఎంటర్ ద గర్ల్ డ్రాగన్’ సినిమాకు హిందీ వెర్షన్ ఇది. బ్రూస్ లీకి వీరాభిమాని అయిన ఒక అమ్మాయి కథను ‘ఎంటర్ ది గర్ల్ డ్రాగన్’ పేరుతో తెరపై ఆవిష్కరించారు.
Also Read: రంగమ్మత్తను మించి ద్రాక్షాయణి.. వామ్మో అందమైన అనసూయ ఇలా అయిపోయిందే...
Also Read: పెళ్లైందని మర్చిపోయారా… ఆమెతో రొమాన్స్ ఏంటి..
Also Read: సీక్రెట్ రూమ్ లో జెస్సీ.. రవికి వార్నింగ్ ఇచ్చిన షణ్ముఖ్
Also Read: అల్లు అర్జున్ కి షాక్.. లీగల్ నోటీసులు పంపించిన సజ్జనార్..
Also Read: అర్జున ఫల్గుణ... ఎన్టీఆర్ అభిమానిగా శ్రీవిష్ణు
Also Read: వనభోజనాలు కార్తీకమాసంలోనే చేస్తారెందుకు .. ఉసిరి చెట్టుకిందే తినాలని ఎందుకు చెబుతారు..!
Also Read: కార్తీక స్నానాలు ఎందుకు చేయాలి… అంత చలిలో అవసరమా…!
Also Read: నీరు, నిప్పు, నింగి, గాలి, పృథ్వి .. పంచభూత శివలింగాలు ఎక్కడ ఉన్నాయంటే..
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి