ప్రముఖ దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ ఏ మాత్రం తగ్గడం లేదు. చర్చలతో సంతృప్తిగా ఉన్నానని చెప్పి హైదరాబాద్ వచ్చిన ఆయన ప్రభుత్వంపై ట్వీట్ల దాడి చేస్తున్నారు. గంటలో ఏకంగా 24 ట్వీట్లు చేసి ప్రభుత్వంపై వరుసగా ప్రశ్నలు సంధించారు. సినిమాల టికెట్ల ధరలకు విధించినట్లే రాష్ట్రంలో ఇంకేదైనా ఉత్పత్తిపై ప్రభుత్వం నిబంధనలు విధించిందా?ఒక వేళ విధించి ఉంటే ఆ ఉత్పత్తుల పేర్లు, అందుకు కారణాలు చెప్పాలన్నారు. రూ.500 కోట్లతో తీసిన ఆర్ఆర్‌ఆర్ రూ.కోటి తీసిన చిత్రంతో ఎలా పోలుస్తామని ఆయన ప్రశ్నించారు. చిన్న చిత్రాలతో సమానంగా భారీ చిత్రాల టికెట్ ధర ఎలా నిర్ణయిస్తారని ప్రశ్నించారు. సినిమా నిర్మాణ వ్యయంతో తమకు సంబంధం లేదని ప్రభుత్వం వాదించాలనుకుంటే అదే వాదన ప్రపంచంలో ఎక్కడ తయారైన వస్తువుకైనా వర్తిస్తుందో లేదో చెప్పాలన్నారు.
తక్కువ ధరలకు అమ్మాలని ప్రభుత్వం బలవంతం చేస్తే, అసలు ఉత్పత్తే ఆగిపోవచ్చు. అప్పుడు నాసిరకం ఉత్పత్తులు బయటకు వస్తాయని వర్మ విశ్లేషించారు.0 క రాష్ట్రంలో సినిమా టికెట్ రూ.2,200లకు విక్రయిస్తుంటే, అదే సినిమా టికెట్ ఏపీలో రూ.200లకు ఎలా విక్రయిస్తారు. ఆర్టికల్14 ప్రకారం అది నిబంధనలు ఉల్లంఘించడమేనన్నారు. టికెట్ల ధరలు, సమయాలు, ప్రదర్శన విషయంలో ప్రభుత్వ జోక్యం తగదు. ఇతర వస్తువుల ధరల విషయంలో లేని ప్రభుత్వ జోక్యం టికెట్లపై ఎందుకని ప్రశ్నించారు.
Also Read: నాలుగు గంటల భేటీ మధ్యలో రొయ్యల బిర్యానీ లంచ్ ! చివరికి ఏమి తేల్చారంటే ?
రాత్రీ, పగలు థియేటర్‌లలో సినిమాలు ప్రదర్శిస్తే, వచ్చే ప్రమాదం ఏంటని ఆర్జీవీ ప్రశ్నించారు. వినియోగదారుడి సమయానుకూలత, పని వేళలు బట్టి సినిమా ప్రదర్శనలు వేయవచ్చు కదా! వాళ్లకు ఉన్న వెసులుబాటు బట్టి అర్ధరాత్రి సైతం సినిమా చూసేలా అవకాశం ఎందుకు ఇవ్వకూడన్నారు. బెనిఫిట్ షోలకు టికెట్ ధరలు అధికంగా ఉన్నా, ప్రజలు కొనుగోలు చేసే శక్తి ఉన్నప్పుడు ప్రభుత్వానికి ఆదాయం సమకూరుతుంది కదా అని ప్రశ్నించారు.
Also Read: జగన్ చుట్టూ ప్రమాదకర వ్యక్తులు ! ఎవరిని ఉద్దేశించి ఆర్జీవీ ఇలా చెబుతున్నారు ?
ఒక నటుడికి నిర్మాత ఎంత పారితోషికం చెల్లిస్తున్నారనే విషయంలో ప్రభుత్వానికి ఉన్న సమస్య ఏంటని.. ఐఫోన్ విడి భాగాలు వెయ్యి కూడా ఉండవని.. కానీ, రూ.2లక్షలు పెట్టి మనం ఆ ఫోన్ కొనుగోలు చేస్తున్నాం. ఎందుకంటే ఫోన్ తయారు చేసిన ఆలోచనకు అంత చెల్లిస్తున్నాం. బ్రాండ్, మార్కెట్ అలా డిమాండ్ చేస్తుందన్నారు. ఈ విపత్కర పరిస్థితుల్లో డిజాస్టర్ మేనేజ్‌మెంట్ యాక్ట్ అమలు సబబే. కానీ, సినిమాటోగ్రఫీ యాక్ట్‌ను అమలు చేయాల్సినంత అవసరం ఏమొచ్చిందని ఆర్జీవీ ప్రశ్నించారు.
ఒకవేళ ప్రజలపై ప్రభుత్వానికి మమకారం ఉంటే, ఎవరైతే సినిమా టికెట్‌ను అధిక ధర వెచ్చించి కొనుగోలు చేయలేరో వారికి సంక్షేమ పథకం కింద ప్రభుత్వమే రాయితీ కల్పించాలని సూచించారు. టికెట్ రేట్లు, థియేటర్‌లలో షోలు వదిలేసి, భద్రత, పన్నులపై ప్రభుత్వం దృష్టి పెడితే బాగుంటుందని ఆర్జీవీ చివరిగా ప్రభుత్వానికి సలహా ఇచ్చారు. దీనిపై ఇప్పుడు స్పందించాల్సింది ప్రభుత్వమే.
Also Read: టిక్కెట్ల వివాదం ముదరదు.. త్వరలోనే పరిష్కారం : సజ్జల