టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకున్న సమంత.. నటుడు నాగచైతన్యను ప్రేమించి పెళ్లి చేసుకుంది. ఎంతో అన్యోన్యంగా ఉండే ఈ జంట విడాకులు తీసుకొని షాకిచ్చింది. ఇప్పటివరకు వీరి విడాకులకు గల కారణాలు మాత్రం బయటకు రాలేదు. నాలుగేళ్ల తమ వివాహబంధానికి ఫుల్ స్టాప్ పెడుతూ.. ఈ ఏడాది అక్టోబర్ 2న ఈ జంట విడిపోతున్నట్లు ప్రకటించింది.
అప్పటినుంచి సమంతను టార్గెట్ చేస్తూ.. సోషల్ మీడియాలో చాలా మంది ట్రోల్ చేశారు. దీంతో సమంతకు ఇండస్ట్రీలో అవకాశాలు రావేమో అనుకున్నారు. కానీ ఇంతకముందుకంటే మరింత జోరుగా ప్రాజెక్ట్ లు ఓకే చేస్తుంది సమంత. రీసెంట్ గా ఇంటర్నేషనల్ ప్రాజెక్ట్ కూడా ఓకే చేసింది. తెలుగులోనే కాకుండా.. బాలీవుడ్ లో కూడా వరుస సినిమాలను లైన్ లో పెడుతోంది. త్వరలోనే ఆ సినిమాలకు సంబంధించిన వివరాలు తెలియనున్నాయి.
ఇదిలా ఉండగా.. తాజాగా సమంతను ఉద్దేశిస్తూ రామ్ చరణ్ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. 'ఆర్ఆర్ఆర్' సినిమా ప్రమోషన్స్ లో భాగంగా రామ్ చరణ్, ఎన్టీఆర్, రాజమౌళి పలు ఇంటర్వ్యూలలో పాల్గొంటున్నారు. రాపిడ్ ఫైర్ రౌండ్ లో రామ్ చరణ్ ను సమంత గురించి ప్రశ్నించారు. దానికి వెంటనే చరణ్ 'కమ్ బ్యాక్.. బిగ్గర్.. స్ట్రాంగర్..' అంటూ చెప్పాడు. ఈ సమాధానం విన్న సమంత.. చరణ్ వీడియోను షేర్ చేస్తూ లవ్ సింబల్స్ పోస్ట్ చేసింది.
ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. గతంలో రామ్ చరణ్-సమంత ఇద్దరూ కలిసి 'రంగస్థలం' అనే సినిమాలో నటించారు. సుకుమార్ డైరెక్ట్ చేసిన ఈ సినిమా భారీ విజయాన్ని అందుకుంది. ఇందులో సమంత, చరణ్ ల పెర్ఫార్మన్స్ కి ఆడియన్స్ ఫిదా అయిపోయారు.
Also Read:అఖిల్ 'బీస్ట్' లుక్.. ట్రాన్స్ఫర్మేషన్ చూసి ఫ్యాన్స్ షాక్..
Also Read: పాముతో పాటేసుకుంది.. దానికి తిక్కరేగి కాటేసింది.. ప్రముఖ సింగర్‌కు చేదు అనుభవం
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి