జోరు వానలో ఎంత తడిచినా పర్వాలేదు. కానీ, ఉరుములు మెరుపులు ఎక్కువగా ఉన్నప్పుడు బయటకు వెళ్లడం అంత సురక్షితం కాదు. ఏ పిడుగు ఎప్పుడు ఎక్కడ పడుతుందో చెప్పలేం. పిడుగుకు ప్రాణాలు తీసేంత పవర్ ఉంది. కాబట్టి.. ఆ సమయంలో కనీసం కిటికీల వద్ద కూడా నిలుచుకూడదు. కాదు.. కూడదని మొండికేసి బయటకు వెళ్తే.. ఇదిగో ఈ వ్యక్తికి ఎదురైన పరిస్థితే మీకూ ఎదురుకావచ్చు. 


ఇండోనేషియాలోని జకార్తలో ఓ వ్యక్తి వర్షంలో గొడుగు పట్టుకుని రోడ్డుపై నడుస్తున్నాడు. కొంచెం దూరం వెళ్లిన తర్వాత అకస్మాత్తుగా పిడుగు నేరుగా అతడిపై పడింది. అంతే.. క్షణాల్లో ఆ ప్రాంతం నిప్పుల వర్షం కురుస్తున్నట్లుగా మారిపోయింది. పిడుగు దెబ్బకు బాధితుడు కుప్పకూలాడు. అక్కడే ఉన్న స్థానికులు హుటాహుటిన వెళ్లి.. అతడికి సాయం చేశారు. అక్కడి సీసీటీవీ కెమేరాలో రికార్డైన ఈ ఘటన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా చక్కర్లు కొడుతోంది. 


ఇప్పుడు ఎలా ఉన్నాడు?: సాధారణంగా పిడుగు పడితే బతికే అవకాశాలు చాలా తక్కువ. అక్కడికక్కడే చనిపోయే ప్రమాదం ఉంది. కానీ, ఈ బాధితుడు మాత్రం ప్రాణాలతో బయటపడ్డాడు. అతడిని వెంటనే స్థానిక హాస్పిటల్‌లో చేర్చడంతో వైద్యులు హుటాహుటిన వైద్యం అందించారు. అయితే, పిడుగు సరిగ్గా అతడి మీదే పడటానికి కారణాలేమిటనే అంశంపై చర్చ జరుగుతోంది. అతడి వద్ద వాకీటాకీ ఉండటం వల్ల పిడుగు.. నేరుగా పడి ఉంటుందని కొందరు అంటున్నారు. మరికొందరు మాత్రం.. గొడుకు ఉండే లోహపు కడ్డీ పిడుగును ఆకర్షించి ఉండవచ్చని అంటున్నారు. అసలు అక్కడ ఏం జరిగిందనేది ఈ కింది వీడియోలో చూడండి. 






Also Read: వామ్మో.. కొప్పులో పాము, ఆమె జడను చూసి జడుసుకున్న జనం, వీడియో వైరల్


Also Read: ఇలా హగ్ చేసుకుంటే.. శృంగారానికి ‘సై’ అన్నట్లే.. ఒక్కో కౌగిలింతకు ఒక్కో అర్థం!


Also Read: ఓనరమ్మతో భర్త సయ్యాట.. డోర్ బెల్ కెమేరాకు చిక్కిన శ్రీవారి లీలలు! (వీడియో)


Also Read: బాయ్‌ఫ్రెండ్ ముద్దు పెట్టలేదని పోలీసులకు కాల్ చేసిన ప్రియురాలు, చివరికి..


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి