'బాహుబలి'తో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్‌ను దర్శక ధీరుడు రాజమౌళి పాన్ ఇండియా స్టార్ చేశారు. అంతకు ముందు ఆయనతో 'ఛత్రపతి' సినిమా తీశారు. యంగ్ టైగర్ ఎన్టీఆర్‌తో 'స్టూడెంట్ నెంబర్ 1', 'సింహాద్రి', 'యమదొంగ' సినిమాలు చేశారు. జనవరి 7న ప్రేక్షకుల ముందుకు రానున్న 'ఆర్ఆర్ఆర్: రౌద్రం రణం రుధిరం' సినిమా ఈ ఇద్దరి కలయికలో నాలుగో సినిమా. ప్రభాస్... ఎన్టీఆర్... ఇద్దరితో రాజమౌళి సినిమాలు చేశారు. ఇద్దరితో ఆయనకు క్లోజ్ రిలేషన్ ఉంది. మరి, ఇద్దరిలో కామన్ క్వాలిటీ ఏంటనేది చెప్పుకొచ్చారు.
"ప్రభాస్... రాజమౌళి... ఇద్దరూ ఫుడ్ లవర్స్. ఫుడ్ అంటే ఇద్దరికీ చాలా అంటే చాలా ఇష్టం. ప్రభాస్ మంచి మంచి వంటకాలు వండించి పెడతాడు. ఎన్టీఆర్ అయితే స్వయంగా వండి పెడతాడు. తను మంచి కుక్. ఫుడ్ తప్ప... ఇద్దరిలో మరో కామన్ క్వాలిటీ లేదు. ఇద్దరి ప్రపంచాలు వేరు" అని ఓ ఇంటర్వ్యూలో రాజమౌళి పేర్కొన్నారు. ఎన్టీఆర్ చాలా ఓపెన్ అని కూడా ఆయన చెప్పుకొచ్చారు. ఏదీ దాచుకోడని అన్నారు.
Also Read: బాలకృష్ణ ముందు మీసం మెలేసిన రాజమౌళి!
'మీపై ప్రభావం చూపించిన దర్శకులు ఎవరు?' అనే ప్రశ్నకు... "కెవి రెడ్డి, రామ్ గోపాల్ వర్మ" అని రాజమౌళి సమాధానం ఇచ్చారు. కొన్ని అంశాల్లో రాజ్ కుమార్ ప్రభావం చూపించారని చెప్పారు. రాజ్ కుమార్ హిరాణి తనకు ఇష్టమైన దర్శకుడు అని, అయితే ఆయన ప్రభావం తనపై లేదని చెప్పుకొచ్చారు. 






Also Read: బాలకృష్ణ వీక్‌నెస్ మీద‌ కొట్టిన రాజమౌళి
Also Read: రాజమౌళి డైరెక్ష‌న్‌లో సినిమా ఎప్పుడు? ఇదీ అల్లు అర్జున్ రియాక్షన్!
Also Read: దక్షిణాది భాషల్లో... రాజమౌళి సమర్పించు!
Also Read: రాజమౌళి మాట్లాడారు! సరే కానీ... హీరోలు అందుకు రెడీగా ఉన్నారా?
Also Read: ప్రేక్షకులు థియేటర్లకు రావడం కోసమే ఎన్టీఆర్, చరణ్! ఆ తర్వాత... - రాజమౌళి ఏమన్నారంటే?
ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి