వరంగల్ జిల్లాలో మరోసారి ఒమిక్రాన్ కలకలం రేగింది. నగరంలోని బ్యాంక్ కాలనీలో స్విట్జర్లాండ్ నుంచి వచ్చిన 24 ఏళ్ల యువకుడికి ఒమిక్రాన్ వైరస్ సోకినట్లు తేలింది. ఈ మేరకు వరంగల్ డీఎంహెచ్వో వెంకటరమణ వివరాలు వెల్లడించారు. ఈనెల 12న స్విట్జర్లాండ్ నుంచి యువకుడి వరంగల్ కు వచ్చాడు. అతడికి సాధారణంగా కరోనా పరీక్షలు చేయగా కోవిడ్ నిర్థారణ అయింది. అనంతరం  నమూనాలను జీనోమ్ సీక్వెన్సింగ్ కోసం పంపారు. అతడికి ఒమిక్రన్ పాజిటివ్ గా నిర్ధారణ అయింది. వెంటనే యువకుడిని హైదరాబాద్ లోని టిమ్స్ కు రిఫర్ చేశారు వైద్యులు. అతడి దగ్గర బంధుమిత్రులకు 20 మందికి శాంపుల్స్ సేకరించి పరీక్షల కోసం పంపినట్లు చెప్పారు. కరోనా వైరస్ విజృంభిస్తున్న తరుణంగా ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని, భౌతిక దూరం పాటిస్తూ, మాస్కులు ధరించాలని వరంగల్ జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి కె. వెంకటరమణ తెలిపారు. 


సిరిసిల్లలో ముగ్గురికి ఒమిక్రాన్


రాజన్న సిరిసిల్ల జిల్లాలో మరో ముగ్గురికి ఒమిక్రాన్‌ సోకినట్టు వచ్చినట్లు తేలింది. ఇటీవల దుబాయ్‌ నుంచి వచ్చిన వ్యక్తికి ఒమిక్రాన్‌ వచ్చింది. తాజాగా బాధితుడి భార్య, తల్లి, స్నేహితుడికి వైరస్‌ వ్యాప్తించింది. ఒమిక్రాన్‌ బాధితులను చికిత్స కోసం హైదరాబాద్‌ టిమ్స్‌కు తరలించినట్లు అధికారులు తెలిపారు. వీరి ప్రైమరీ, సెకండరీ కాంటాక్ట్స్ కు కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నారు.  


Also Read: నైట్ కర్ఫ్యూతో ఒమిక్రాన్‌ వ్యాప్తి తగ్గుతుందా ? హౌ? ఎలా?


తెలంగాణలో విస్తరిస్తోన్న ఒమిక్రాన్


తెలంగాణలో ఆదివారం 3 ఒమిక్రాన్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం ఒమిక్రాన్‌ కేసుల సంఖ్య 44కు చేరాయి. గడచిన 24 గంటల్లో 20,576 కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు. కొత్తగా 109 మందికి కరోనా పాజిటివ్‌ వచ్చింది. దీంతో ఇప్పటివరకు నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 6,80,662కి చేరింది. రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ తాజా బులిటెన్‌ లో ఈ వివరాలు ప్రకటించింది. గత 24 గంటలలో కరోనాతో ఒక్కరు మరణించారు. దీంతో ఇప్పటివరకు రాష్ట్రంలో 4,022కి కరోనాతో మరణించారు. కరోనా బారి నుంచి తాజాగా 190 మంది కోలుకున్నారు. రాష్ట్రంలో 3,167 యాక్టివ్‌ కేసులు ఉన్నాయని వైద్యారోగ్య శాఖ తెలిపింది.


Also Read: షిర్డీ వెళ్తున్నారా? ఆగండి.. ఆగండి.. దర్శన వేళల్లో మార్పులు చేశారు తెలుసా? 


44కి చేరిన ఒమిక్రాన్ కేసులు


తెలంగాణలో గడచిన 24 గంటల వ్యవధిలో ఎట్‌ రిస్క్‌ దేశాల నుంచి 248 మంది శంషాబాద్‌ విమానాశ్రయానికి చేరుకున్నారు. వారందరికీ కోవిడ్‌ ఆర్‌టీపీసీఆర్‌ టెస్టులు చేశారు. వారిలో ఇద్దరు ప్రయాణికులకు కోవిడ్‌ పాజిటివ్‌ వచ్చింది. దీంతో వారి నమూనాలను అధికారులు జీనోమ్‌ సీక్వెన్సింగ్‌కి పంపించారు. ఒక్కరోజు వ్యవధిలో తెలంగాణలో 3 ఒమిక్రాన్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం మొత్తం ఒమిక్రాన్ కేసులు సంఖ్య 44కి చేరింది. ఒమిక్రాన్‌ వేరియంట్‌ బారిన పడిన వారిలో ఇప్పటి వరకు 10 మంది కోలుకున్నారని వైద్యులు తెలిపారు. ఎట్‌ రిస్క్‌ దేశాల నుంచి ఇప్పటి వరకు తెలంగాణకు 11,493 మంది ప్రయాణికులు వచ్చారు. 


Also Read: కొత్త సంవత్సరం కానుక! జనవరి 1న రైతుల ఖాతాల్లో డబ్బులు వేయనున్న మోదీ


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి