టీవీలో ఏదైనా రుచికరమైన వంటకం చూస్తే.. నోరూరుతుంది. వెంటనే వండుకుని రుచి చూడాలనిపిస్తుంది. అయితే, పరిశోధకులు తయారు చేసిన ఈ సరికొత్త టీవీలో ఏ వంటకమైతే కనిపిస్తుందో.. దాని రుచిని ఆస్వాదించవచ్చు. నేరుగా టీవీ స్క్రీన్ నాకితే చాలు.. మీరు అందులో కనిపించే ఆహారాన్ని రుచి చూసినట్లే ఉంటుంది. అర్థం కాలేదా? అదెలా సాధ్యమో చూడండి. 


జపాన్‌లోని మెయిజి యూనివర్సిటీ(Meiji University)కి చెందిన ప్రొఫెసర్ హోమీ మియాషితా ‘టేస్ట్ ది టీవీ’ (Taste The TV-TTTv) అనే టెలివిజన్‌ను కనిపెట్టారు. పేరుగు తగినట్లే.. కస్టమర్లు ఈ టీవీని టేస్ట్ చేయొచ్చు. ఈ టీవీ తెరపై ఏదైతే వంటకం కనిపిస్తుందో దాన్ని.. టేస్ట్ చేయొచ్చు. ఇందుకు కస్టమర్ ఆ టీవీ స్క్రీన్‌ను నాకితే చాలు. ప్రయోగాత్మకంగా సుమారు 10 రకాల రుచులను ఈ టీవీలో స్టోర్ చేశారు. ఉదాహరణకు మీ ఇంట్లో.. బిర్యానీ వండినట్లే.. ఆ వంటకాన్ని ఫొటో లేదా వీడియో తీసి పంపితే చాలు. అది టీవీ స్క్రీన్ మీదకు రాగానే.. ఆ రుచులను టీవీ స్క్రీన్ రిలీజ్ చేస్తుంది. 


వింతగా ఉందే.. అదెలా సాధ్యం?: టీవీ స్క్రీన్ నుంచి రుచులు రావడం ఏమిటీ వింతగా ఉందే అని అనుకుంటున్నారా? అయితే, హోమి కనిపెట్టిన ఈ టెక్నాలజీ గురించి తెలుసుకోవల్సిందే. ‘‘కరోనా వైరస్ తర్వాత చాలామంది రెస్టారెంట్లకు, ఫాస్ట్ ఫుడ్ సెంటర్లకు వెళ్లడం మానేశారు. దాని వల్ల అక్కడి రుచులను చాలా మిస్ అవుతున్నారు. అందుకే, ఇంట్లోనే కూర్చోని ఆ ఆహారాన్ని చూస్తు రుచి చూసేలా.. టీవీని రూపొదించాను’’ అని హోమీ తెలిపారు. ఇందుకు ఆయన వివిధ రసాయనాలతో ఓ చాంబర్ తయారు చేశాడు. అందులో అన్నిరకాల రుచులు ఉంటాయి. మీరు ఎంపిక చేసుకున్న రుచిని బట్టి.. ఆయా రసాయనాలు కలిసి.. టీవీ స్క్రీన్ మీద పొరలా ఏర్పడతాయి. మీరు వాటిని నేరుగా నాలుకతో టేస్ట్ చేయొచ్చు. 


చాక్లెట్ నుంచి పిజ్జా వరకు ప్రతి ఒక్కటీ ఈ టీవీ స్క్రీన్ నాకి మరీ టేస్ట్ చూడవచ్చు. భవిష్యత్తులో ప్రపంచంలో ఉన్న ముఖ్యమైన వంటకాల రుచులన్నీ ఈ టీవీలో చేర్చుతానని హోమీ చెబుతున్నారు. ప్రస్తుతతానికి ఈ టీవీ స్క్రీన్‌పై కొన్ని రుచులు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. దీన్ని నేరుగా టేస్ట్ చేసిన కొంతమంది ఆహార ప్రియులు.. తప్పకుండా ఈ టీవీ తమ అవసరాలను తీర్చుతుందని అంటున్నారు. ప్రస్తుతం ఈ టీవీ ఇంకా మార్కెట్లోకి రాలేదు. దీని విలువ రూ.65 వేలు వరకు ఉంటుందని హోమీ తెలిపారు. మీకు కూడా ఇలా నాలుకను లపలపలాడించే టీవీ కావాలా? అయితే.. కొద్ది రోజులు వేచి చూడండి. 



Also Read: వామ్మో.. కొప్పులో పాము, ఆమె జడను చూసి జడుసుకున్న జనం, వీడియో వైరల్


Also Read: ఇలా హగ్ చేసుకుంటే.. శృంగారానికి ‘సై’ అన్నట్లే.. ఒక్కో కౌగిలింతకు ఒక్కో అర్థం!


Also Read: ఓనరమ్మతో భర్త సయ్యాట.. డోర్ బెల్ కెమేరాకు చిక్కిన శ్రీవారి లీలలు! (వీడియో)


Also Read: బాయ్‌ఫ్రెండ్ ముద్దు పెట్టలేదని పోలీసులకు కాల్ చేసిన ప్రియురాలు, చివరికి..


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి