కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ ఇప్పుడు అన్ని రాష్ట్రాలను ఆందోళనకు గురి చేస్తోంది. కేంద్రం పదే పదే హెచ్చరికలు జారీ చేస్తూండటంతో రాష్ట్రాలు ఆంక్షల దిశగా వెళ్తున్నాయి. మహారాష్ట్ర, కర్ణాటక వంటివి నైట్ కర్ఫ్యూ ప్రకటించాయి. అయితే చాలా మందికి ఇక్కడే ఓ సందేహం వస్తోంది. జన సంచారం సహజంగానే ఉండని రాత్రి పూట కర్ఫ్యూ పెట్టడం వల్ల ప్రయోజనం ఏమిటి ?. నిజం చెప్పాలంటే ఎవరికీ తెలియదు. నైట్ కర్ఫ్యూ పెడుతున్న రాష్ట్రాలు కూడా ఈ అంశంపై క్లారిటీ ఇవ్వలేదు. నిజానికి నైట్ కర్ఫ్యూ పెట్టడం ఇప్పుడే మొదటి సారి కాదు. సెకండ్ వేవ్ సమయంలోనూ దాదాపుగా అన్ని రాష్ట్రాలు ముందుగా నైట్ కర్ఫ్యూ పెట్టాయి. అయితే ప్రజలకు మొదటిగా వచ్చిన సందేహం ఇది. ఇప్పుడు ఒమిక్రాన్ విషయంలోనూ అదే డౌట్ అందరికీ వస్తోంది.
Also Read: పిల్లలకు కొవిడ్ టీకా కోసం జనవరి 1 నుంచి రిజిస్ట్రేషన్.. ఎలా చేయాలంటే..?
సోషల్ మీడియాలో నైట్ కర్ఫ్యూ వల్ల కరోనా ఎలా కంట్రోల్ అవుతుందనే చర్చ జోరుగా సాగుతోంది. ప్రభుత్వ నిర్ణయాలు కాబట్టి సెలబ్రిటీలు ఈ అంశంపై పెద్దగా మాట్లాడరు. ఎక్కడ ప్రభుత్వాలు తమపై ఆగ్రహం వ్యక్తం చేస్తాయోనని ఆందోళన చెందుతారు . కానీ ఆర్జీవీ లాంటి బిందాస్ వ్యక్తులు మాత్రం ఇలాంటి సందేహాలు దాచుకోరు. నిరభ్యంతరంగా సోషల్ మీడియాలో వ్యక్తం చేస్తారు. ఇలా ఆర్జీవీ పెట్టిన ఓ ట్వీట్ వైరల్ అవుతోంది. ఆర్జీవీ కాబట్టి.. తన ట్వీట్‌కు తానే అనేక సమాధానాలు ఇచ్చుకుంటూ నిర్ణయం తీసుకుంటున్న రాజకీయ నేతలపై సెటైర్లు వేస్తున్నారు.
Also Read: Omicron Effect: షిర్డీ వెళ్తున్నారా? ఆగండి.. ఆగండి.. దర్శన వేళల్లో మార్పులు చేశారు తెలుసా?
బీజేపీ ఎంపీ, ఉత్తరప్రదేశ్ నేత వరుణ్ గాంధీ కూడా ఇదే తరహాలో ప్రశ్నించారు.
Also Read: PM Kisan Yojana: కొత్త సంవత్సరం కానుక! జనవరి 1న రైతుల ఖాతాల్లో డబ్బులు వేయనున్న మోదీ
అయితే ఇంత వరకూ ఏ ప్రభుత్వమూ .. ఏ ఒక్క నిపుణుడు కూడా ఈ అంశంపై స్పష్టమైన.. లాజికల్‌గా సమాధానం చెప్పలేకపోయారు. "రాత్రి కర్ఫ్యూ వల్ల పెద్దగా ప్రయోజనం ఉండదు కానీ పరిస్థితి ఆందోళన కరంగా ఉందన ప్రజలకు ఓ మెసెజ్ వెళ్తుందని కొంత మంది విశ్లేషిస్తున్నారు. ఏ విధంగా చూసినా నైట్ కర్ఫ్యూ అనేది ఓ హెచ్చరిక లాంటిదే తప్ప.. వైరస్ వ్యాప్తిని కంట్రోల్ చేయడానికి మెడిసన్ కాదని అంటున్నారు. ఆలోచిస్తే అంతకు మించి సమాధానం ఎవరికీ దొరకదు..? పైగా..., వైరస్ నైట్ షిఫ్టే చేస్తుందా..? అందరూ ఇళ్లలో పడుకున్నప్పుడు రోడ్ల మీద తిరుగుతుందా..? లాంటి సందేహాలు వస్తాయి. అందుకే ప్రభుత్వం చెప్పిందని పాటించడం మినహా మరో చాయిసే లేదు.