తెలుగులో మల్టీస్టారర్ సినిమాలు తక్కువ. ఒకవేళ వచ్చినా... అందులో ఓ సీనియర్ స్టార్ హీరో, మరో యంగ్ హీరో ఉంటారు. ఇద్దరు యంగ్ స్టార్స్‌ను ఓ సినిమా ('ఆర్ఆర్ఆర్: రౌద్రం రణం రుధిరం') చేయడానికి ఒప్పించినా ఘనత రాజమౌళిదే. యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మధ్య మంచి స్నేహం ఉంది. అయితే... ఇంతకు ముందెప్పుడూ వాళ్లిద్దరూ కలిసి సినిమాలు చేయలేదు. 'ఆర్ఆర్ఆర్'తో వాళ్ల కాంబినేషన్ కుదిరింది. అయితే... ఈ సినిమా తర్వాత ఇటువంటి మల్టీస్టారర్స్ ఆశించవచ్చా? ఈ విషయమై రాజమౌళి ఏమన్నారంటే?


"మీరు ఏ రచయితను అయినా అడగండి... ప్రతి ఒక్కరి దగ్గర అద్భుతమైన కథలు ఉంటాయి. ఇద్దరు హీరోలు, ముగ్గురు హీరోలతో చేయడానికి, రాయడానికి అద్భుతమైన కథలు ఉంటాయి. హీరోలు కూడా చేయడానికి రెడీగా ఉన్నారు. నా మాటలు గుర్తు పెట్టుకోండి... కథ, క్యారెక్టర్ బావుంటే, మల్టీస్టారర్ చేయడానికి ప్రతి హీరో రెడీగా ఉన్నారు. అయితే... అభిమానులు చూస్తారా? లేదా? కొట్టుకుంటారా? అనే భయం ఉంది. 'ఆర్ఆర్ఆర్' విడుదలై... మేమంతా ఆశిస్తున్నట్టు అద్భుత విజయం సాధించిన తర్వాత... ఎక్కువ మల్టీస్టారర్ సినిమాలు వస్తాయని ఆశిస్తున్నాను" అని రాజమౌళి చెప్పారు.
Also Read: ప్రేక్షకులు థియేటర్లకు రావడం కోసమే ఎన్టీఆర్, చరణ్! ఆ తర్వాత... - రాజమౌళి ఏమన్నారంటే?
రాజమౌళి మల్టీస్టారర్ సినిమాల గురించి ఆ విధంగా మాట్లాడారు సరే కానీ... ఎంత మంది హీరోలు రెడీగా ఉన్నారు? ఇప్పుడీ ప్రశ్న ప్రేక్షకుల్లో ఉంది. ఎన్టీఆర్ ఇంతకు ముందెప్పుడూ పాన్ ఇండియా సినిమా చేయలేదు. 'ఆర్ఆర్ఆర్'తో కుదిరింది. అయితే... ఇదేమీ ప్లాన్ చేసుకున్నది కాదు. రాజమౌళి దర్శకుడని 'ఆర్ఆర్ఆర్' అంగీకరించానని, తర్వాతే పాన్ ఇండియా సినిమా అని తెలిసిందని ఎన్టీఆర్ చెప్పారు. రాజమౌళి దర్శకుడు కాబట్టే... ఈ మల్టీస్టారర్ వచ్చింది. మిగతా దర్శకులు ఇంత భారీ స్థాయిలో మల్టీస్టారర్ సినిమాలు చేయగలరా? చేయడానికి ముందుకొస్తే హీరోలు రెడీ అంటారా? కాలమే సమాధానం చెప్పాలి.

Also Read: హైద‌రాబాద్‌లోని ఓ బిజీ ఏరియాకు హీరోల‌ను తీసుకువెళ్లిన ద‌ర్శ‌కుడు...
Also Read: ఏందీ గిల్లుడు? ఏందీ కితకితలు?? ఎన్టీఆర్, చరణ్ మహా చిలిపి సుమీ!
Also Read: 'సుడిగాలి' సుధీర్‌కు ఓ షో పోయింది! మరో షోలో మాత్రం...
Also Read: ఫన్నీ వీడియో: బ్రహ్మీతో ‘ఊ అంటావా..’ స్పూఫ్ సాంగ్.. దేవీశ్రీ ప్రసాద్ స్పందన ఇది!
Also Read: ప్రేక్షకులు థియేటర్లకు రావడం కోసమే ఎన్టీఆర్, చరణ్! ఆ తర్వాత... - రాజమౌళి ఏమన్నారంటే?
Also Read: దేవిశ్రీ ఆ సాంగ్‌ను కాపీ కొట్టాడా? ఊ అంటారా... ఉఊ అంటారా?
ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి