Aryan Khan Case: షారుక్ ఖాన్‌కు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ లేఖ.. ఎందుకో తెలుసా?

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ.. షారుక్ ఖాన్‌కు ఓ లేఖ రాశారు. అయితే ఆర్యన్ ఖాన్ జైలులో ఉన్నప్పుడు ఈ లేఖ రాసినట్లు సమాచారం.

Continues below advertisement

బాలీవుడ్ సూపర్‌స్టార్ షారుక్ ఖాన్‌కు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ రాసిన లేఖ వార్త ప్రస్తుతం వైరల్‌గా మారింది. షారుక్ కుమారుడు ఆర్యన్ ఖాన్‌.. ఎన్‌సీబీ కస్టడీలో ఉన్న సమయంలో రాహుల్ లేఖ రాసినట్లు తెలుస్తోంది.

Continues below advertisement

ఇలాంటి కఠిన సమయంలో దేశం మొత్తం షారుక్‌కు అండగా ఉందని రాహుల్ లేఖలో పేర్కొన్నట్లు సమాచారం. డ్రగ్స్ కేసులో ఆర్యన్‌ ఖాన్‌ను ఎన్‌సీబీ కస్టడీలోకి తీసుకున్న తర్వాత రాహుల్ ఈ లేఖ రాశారు.

బెయిల్..

అయితే డ్రగ్స్ కేసులో అరెస్టైన ఆర్యన్ ఖాన్‌కు ఎట్టకేలకు బాంబే హైకోర్టు గత వారంలో బెయిల్ మంజూరు చేసింది. 29 రోజుల పాటు ఆర్యన్ ఖాన్ జైలులో గడిపాడు. 

ఇదీ కేసు..

ముంబయి కోర్డేలియా క్రూయీజ్ ఎంప్రెస్ షిప్‌లో జరిగిన రేవ్ పార్టీలో భారీ ఎత్తున డ్రగ్స్ రాకెట్ బయటపడింది. ఆ ప్రయాణికుల ఓడలో నార్కోటిక్స్ కంట్రోల్‌ బ్యూరో (ఎన్సీబీ) అధికారులు శనివారం అర్ధరాత్రి దాడులు జరిపారు. ఈ రేవ్‌ పార్టీలో పెద్ద ఎత్తున డ్రగ్స్ చెలామణి అవుతుందని విశ్వసనీయ సమాచారం రావడంతో ఎన్సీబీ అధికారులు తనిఖీలు చేశారు. పార్టీలో మత్తు పదార్థాలను వినియోగిస్తున్నట్లు గుర్తించారు. అక్కడే ఎన్సీబీ అధికారులకు అధిక మొత్తంలో కొకైన్‌ సహా ఇతర మత్తు పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. అందులోనే ఉన్న యువతీ యువకులను అదుపులోకి తీసుకున్నారు. 

ఎన్సీబీ టీమ్ అదుపులోకి తీసుకున్న వారిలో బాలీవుడ్‌ హీరో షారుక్ ఖాన్ కుమారుడు ఆర్యన్ ఖాన్ కూడా ఉన్నాడు. ఆదివారం ఉదయం వారందరినీ ముంబయికి తీసుకొని వచ్చారు. అదుపులోకి తీసుకున్న వారిలో 8 నుంచి 10 మందిని విచారణ జరిపారు. ఆర్యన్ ఖాన్‌తో పాటు మరో ఇద్దరికి వైద్య పరీక్షలు కూడా జరిపించారు. 

విచారణలో ఉన్న ఆర్యన్‌ ఖాన్‌కు త్వరగానే బెయిల్ లభిస్తుందని అంతా భావించారు. కానీ ఆర్యన్ ఖాన్ బెయిల్ పిటిషన్‌ను పలుమార్లు కోర్టు కొట్టివేసింది. ఎట్టకేలకు బాంబే హైకోర్టు ఆర్యన్‌కు బెయిల్ మంజూరు చేసింది.

Also Read: 100% Covid Vaccine: 'వ్యాక్సినేషన్‌లో అలసత్వం వహిస్తే.. మరో ముప్పు తప్పదు.. జాగ్రత్త'

Also Read: Vaccine for Children: చిన్నారుల వ్యాక్సినేషన్‌కు సర్వం సిద్ధం.. బైడెన్ ప్రభుత్వం కీలక నిర్ణయం

Also Read: Deepotsav in Ayodhya: అయోధ్యలో దీపోత్సవం.. గిన్నిస్ ప్రపంచ రికార్డ్‌ వెయిటింగ్!

Also Read: Corona Cases: దేశంలో కొత్తగా 11,903 కేసులు నమోదు.. 252 రోజుల కనిష్ఠానికి యాక్టివ్ కేసులు

Also read: రోజుకో అరటిపండు చాలు... ఆ క్యాన్సర్ నుంచి తప్పించుకోవచ్చు

Also read:పిల్లలు ఎత్తు పెరగాలా... అయితే ఈ జాగ్రత్తలు పాటించాల్సిందే

Also read: తీపి అధికంగా తింటున్నారా? అయితే ఈ విషయాలు తెలుసుకోవాల్సిందే

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

 

Continues below advertisement