'ప్రతిరోజూ పండగే' సినిమాలో రాశీ ఖన్నా (Raashi Khanna)ను ఏంజెల్ ఆర్న పాత్రలో చూపించారు దర్శకుడు మారుతి. ఆ తర్వాత ఆయన దర్శకత్వంలో ప్రారంభమైన సినిమా 'పక్కా కమర్షియల్'. అందులో గోపీచంద్ హీరో. గోపీచంద్‌కు జోడీగా రాశీ ఖన్నా నటిస్తున్నారు. నేడు (మంగళవారం, నవంబర్ 30) ఆమె పుట్టినరోజు. ఈ సందర్భంగా 'పక్కా కమర్షియల్' నుంచి రాశీ ఖన్నా బర్త్ డే స్పెషల్ టీజర్ విడుదల చేశారు. ఈసారి ఆమెను నిజంగా ఏంజెల్‌గా చూపించారు. దివి నుంచి భువికి దిగొచ్చిన దేవకన్యలా ఆమెను ప్రజెంట్ చేశారు. ఈ విజువల్ ఓ పాటలోది అని తెలుస్తోంది. మొత్తం మీద రాశీ ఖన్నాకు మారుతి అండ్ 'పక్కా కమర్షియల్' టీమ్ మాంచి బర్త్ డే గిఫ్ట్ ఇచ్చారని నెటిజన్స్ అంటున్నారు.


గోపీచంద్, రాశీ ఖన్నా జంటగా నటిస్తున్న రెండో సినిమా 'పక్కా కమర్షియల్'. ఇందులో ఇద్దరూ లాయర్ రోల్స్ చేస్తున్నారు. హీరోయిన్ అందంగా కనిపించడంతో పాటు నవ్విస్తుందని యూనిట్ అంటోంది. అల్లు అరవింద్ సమర్పణలో యూవీ క్రియేషన్స్, జీఏ2 పిక్చర్స్ పతాకాలపై 'బన్నీ' వాసు చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఎస్.కె.ఎన్ సహ నిర్మాత. ఈ సినిమాకు జేక్స్ బిజాయ్ సంగీతం అందిస్తున్నారు. వచ్చే ఏడాది మార్చి 18న సినిమా విడుదల కానుంది. 





Raashi Khanna Birthday Special (Pakka Commercial) :

Also Read: అక్కడ ప్రభాస్ పాద పూజ... ఇక్కడ పూజతో కౌగిలింత!
Also Read: ముందే చెప్పానుగా... గెలవడానికి మాత్రమే ఇక్కడికి వచ్చాం, కపిల్ దేవ్‌గా అదరగొట్టిన రణ్‌వీర్, 83 ట్రైలర్ విడుదల
Also Read: బాలకృష్ణ ముందు డైలాగులు చెప్పడానికి భయపడ్డా! కానీ...
Also Read: నవ్విస్తానంటున్న అందాల రాక్షసి... కొత్త సినిమాకు సంతకం చేసింది!
Also Read: శివ శంకర్ మాస్టర్ అంత్యక్రియలు పూర్తి... పాడె మోసిన ఓంకార్
Also Read: అవకాశాలు రాక... నృత్య ప్రదర్శనలకు డబ్బు ల్లేక...  సినిమాల్లోకి! ఇదీ శివ శంకర్ మాస్టర్ జర్నీ!
ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి