'రాధే శ్యామ్' సినిమాలో సెకండ్ సాంగ్ టీజర్ సోమవారం విడుదల చేశారు. సౌత్ ఇండియన్ లాంగ్వేజెస్ కోసం జస్టిన్ ప్రభాకరన్ చేత మ్యూజిక్ చేయించారు. హిందీ వెర్షన్ సాంగ్‌ను మిథూన్ కంపోజ్ చేశారు. హిందీ కోసం సపరేట్‌గా, తెలుగు కోసం సపరేట్‌గా సాంగ్స్ చేయిస్తున్నట్టు ముందుగానే చెప్పారు. మ్యూజిక్ మాత్రమే కాదు, విజువల్స్ కూడా అక్కడితో పోలిస్తే... ఇక్కడ డిఫరెంట్‌గా ఉన్నాయి.
హిందీ సాంగ్ టీజర్ నిడివి 36 సెకన్లు ఉంటే... తెలుగు సాంగ్ నిడివి 24 సెకన్లు మాత్రమే ఉంది. హిందీలో హీరోయిన్ పూజా హెగ్డే పాదాలను ప్రభాస్ తాకారు. గతంలో 'మిర్చి' సినిమాలోని ఓ పాటల్లోనూ అనుష్క కాళ్లను అదే విధంగా ఆయన పట్టుకున్నారు. తెలుగు సాంగ్ టీజర్‌కు వచ్చేసరికి ఆ విజువల్స్ లేవు. పూజా హెగ్డే పాదాలను ప్రభాస్ తాకే దృశ్యాల బదులు పూజా హెగ్డేను కౌగిలించుకుంటున్న దృశ్యాలు ఉన్నాయి. హిందీకి ఆ దృశ్యాలు కొత్తగా ఉంటాయని అనుకున్నారేమో! ఈ డిఫరెన్స్ టీజర్‌కు మాత్రమే పరిమితం చేస్తారో? లేదంటే పాటలో కంటిన్యూ చేస్తారో?Also Read: ప్రభాస్, పూజా హెగ్డే లవ్ కెమిస్ట్రీ చూశారా?హిందీ ఆడియన్స్, తెలుగు ఆడియన్స్ అభిరుచులు వేరు. అందుకు తగ్గట్టు మ్యూజిక్‌లో డిఫరెన్స్ చూపిస్తున్నారు. విజువల్స్‌లో కూడా డిఫరెన్స్ తీసుకు వస్తారేమో చూడాలి. 'రాధే శ్యామ్' హిందీ సాంగ్‌ను మిథూన్, అర్జిత్ సింగ్ పాడారు. మిథూన్ మ్యూజిక్ అందించడంతో పాటు లిరిక్స్ రాశారు. హిందీ సాంగ్ టీజర్‌లో లిరిక్స్ వినిపించాయి. తెలుగు హిందీ సాంగ్ టీజర్‌లో పాట పాడిన సిద్ శ్రీరామ్ వాయిస్ వినిపించలేదు. డిసెంబర్ 1న (బుధవారం) ఫుల్ సాంగ్ విడుదల చేయనున్నట్టు వెల్లడించిన సంగతి తెలిసిందే. 'జిల్' ఫేమ్ రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో వంశీ, ప్రమోద్, ప్రసీధ నిర్మించిన ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 14న విడుదల కానుంది.
Aashiqui Aa Gayi Teaser:
Nagumomu Thaarale Teaser: