తన మరణానంతరం కళ్లను డొనేట్ చేసిన కన్నడ సూపర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ కోరిక నెరవేరింది. తన తండ్రి రాజ్ కుమార్ స్పూర్తితో మరణానంతరం కళ్లను దానం చేశారు పునీత్ రాజ్ కుమార్. నలభై ఏళ్ల వయసులోనే పునీత్ సడెన్ గా మరణించడం ఎవరూ జీర్ణించుకోలేకపోతున్నారు. తీవ్ర విషాదంలో ఉన్నప్పటికీ.. కుటుంబసభ్యులు కళ్ల దానానికి సహకరించారు. పునీత్ కోరికను నెరవేర్చారు. బెంగుళూరులోని నారాయణ నేత్రాలయ సంస్థ పునీత్ మృతదేహం నుంచి కళ్లను సేకరించింది. 


Also Read: హిందీ రిలీజ్ ఇష్యూ.. అల్లు అర్జున్ సీరియస్


పునీత్ మరణించిన 48 గంటల వ్యవధిలోపే.. ఆయన కళ్లను నలుగురు అంధులకు చూపునిచ్చాయని నారాయణ నేత్రాలయ ప్రకటించింది. ఇది అరుదైన ఘటన అని వెల్లడించారు. పునీత్ నుంచి కళ్లను సేకరించిన తరువాత.. ఆయన కార్నియాలను నలుగురు అంధులకు అమర్చినట్లుగా డాక్టర్లు తెలిపారు. సాధారణంగా ఒక వ్యక్తి దానం చేసిన కళ్లతో ఇద్దరికి మాత్రమే చూపు దక్కుతుందని.. కానీ పునీత్‌ కళ్లలోని కార్నియాలోని సుపీరియర్‌, డీపర్‌ లేయర్స్‌ని వేరు చేసి నలుగురికి కంటిచూపుని తిరిగిచ్చారు డాక్టర్స్. 


సూపర్‌ఫీషియల్‌ కార్నియల్‌ వ్యాధి ఉన్న వారికి సుపీరియర్‌ లేయర్‌ మార్పిడి చేశామని.. ఎండోథెలియల్/డీప్ కార్నియల్ లేయర్‌ వ్యాధి ఉన్న మరో ఇద్దరికి డీపర్‌ లేయర్‌ ట్రాన్స్‌ప్లాంట్‌ చేశామని.. అలా పునీత్‌ కళ్లతో  నలుగురికి చూపుదక్కిందని వివరించారు. ఒక వ్యక్తి చేసిన నేత్రదానంతో నలుగురికి చూపు రావడమనేది అరుదైన ఘటన అని డాక్టర్స్ తెలిపారు. 


ఎవరైనా నేత్రదానం చేసినా.. వాటి అవసరం కలిగిన వారిని గుర్తించడం కూడా అంత తేలికైన విషయం కాదని వైద్యులు చెబుతున్నారు. కండీషన్ కచ్చితంగా సెట్ అయిన వారికే వీటిని అమర్చే అవకాశం ఉంటుందని తెలిపారు. తను మరణించినా.. ఆయన కళ్లు మరో నలుగురికి చూపుని ప్రసాదించాయి. 


Also Read: మాస్ మహారాజా ఒక్కో సినిమాకి ఎంత తీసుకుంటున్నాడో తెలుసా..?


Also Read: ప్రజెంట్ 'గాడ్ ఫాదర్'... 15 నుంచి 'భోళా శంకర్'... మెగాస్టార్ స్పీడు మామూలుగా లేదుగా!


Also Read: సంక్రాంతి బరిలో రాజ'శేఖర్'... యాంగ్రీ స్టార్ తగ్గేదే లే!


Also Read: 'ఆర్ఆర్ఆర్' గ్లింప్స్‌లో ఇవి గ‌మ‌నించారా!? 


Also Read: ఆర్ఆర్ఆర్... బ్రదర్ & బావా... 45 సెకన్లలో ఎలా?


Also Read: కాజల్ మేడమ్... ఇద్దరూ కలిసి తాగుతున్నారా!? తాగి తాగి సచ్చిపోండి!


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి