కన్నడ చలన చిత్ర పరిశ్రమలో ఎటు చూసినా... బరువెక్కిన హృదయాలు కనిపిస్తున్నాయి. యువ కథానాయకుడు పునీత్ రాజ్‌కుమార్ మీద చిత్రసీమ ప్రముఖులు, అభిమానుల ప్రేమ కన్నీటి ధారగా వస్తోంది. రాజ్‌కుమార్ కుటుంబ సభ్యుల గుండెకోతను వర్ణించడం ఎవరి తరమూ కావడం లేదు.
Also Read: పునీత్ రాజ్‌కుమార్... టాలీవుడ్‌కు దగ్గర బంధువు ఎలా అయ్యారు?
Also Read: మాస్టర్ లోహిత్ నుంచి. మిస్టర్ పునీత్ వరకు....
పునీత్ రాజ్‌కుమార్ శుక్రవారం గుండెపోటుతో మరణించిన విషయం విధితమే. అనంతరం బెంగళూరులోని విక్రమ్ ఆసుపత్రి నుండి ఇంటికి ఆయన పార్థీవ దేహాన్ని తీసుకువెళ్లారు. ఆ తర్వాత అభిమానులు, ప్రజల సందర్శన కోసం కంఠీరవ స్టేడియానికి తీసుకువెళ్లారు. అక్కడే ఆయన అంతిమ సంస్కారాలు నిర్వహించనున్నారు. పునీత్ తల్లితండ్రులు పార్వతమ్మ, కన్నడ కంఠీరవ రాజ్ కుమార్ అంతిమ సంస్కారాలు సైతం కంఠీరవ స్టేడియంలో నిర్వహించారు. అదే ప్రదేశంలో ఇప్పుడు పునీత్ వి నిర్వహించడానికి ఏర్పాట్లు చేశారు.
తొలుత శనివారం అంతిమ సంస్కారాలు నిర్వస్తారని భావించారంతా! అయితే... పునీత్ రెండో కుమార్తె వందిత అమెరికాలో ఉన్నారు. ఆమె ఈ రోజు (శనివారం) సాయంత్రానికి బెంగళూరు చేరుకుంటారు. అందుకని, ఆదివారం అంతిమ సంస్కారాలు నిర్వహించాలని నిర్ణయించారు. ప్రభుత్వ లాంఛనాలతో పునీత్ రాజ్‌కుమార్‌కు తుది వీడ్కోలు పలకనున్నారు.
Also Read: ఎప్పటికీ మా గుండెల్లో ఉంటావ్! - పునీత్ మరణంపై అనుష్క స్పందన
Also Read: నోట మాట రాలేదు... పునీత్ మరణంపై మెగాస్టార్ చిరంజీవి
Also Read: పునీత్ మరణం నమ్మశక్యంగా లేదు.. పవన్ భావోద్వేగం...
Also Read: కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్‌కుమార్ మరణంపై ప్రముఖుల దిగ్భ్రాంతి.. మోదీ ట్వీట్
ప్రస్తుతం కంఠీరవ స్టేడియానికి చలనచిత్ర ప్రముఖులు, అభిమానులు తండోప తండాలుగా తరలివస్తున్నారు. వారిని కట్టడి చేయడం పోలీసులకు కష్టతరం అవుతోంది. పునీత్ రాజ్‌కుమార్‌కు అశ్రు నివాళులు అర్పిస్తున్నారు. ఆయన మృతికి సంతాపంగా కర్ణాటకలో థియేటర్లను మూసివేశారు. మూడు రోజుల పాటు మద్యపాన నిషేధం విధించారు. పునీత్ మరణవార్త తెలిసిన వెంటనే కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ బొమ్మై ఆసుపత్రికి చేరుకున్నారు. అలాగే... పలువురు రాజకీయ, సినీ ప్రముఖులు ఆసుపత్రికి వెళ్లారు. ప్రధాని నరేంద్ర మోదీ, కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ సహా పలువురు రాజకీయ, సినిమా, క్రికెట్ ప్రముఖులు పునీత్ మృతి పట్ల ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు.
Also Read: 'రొమాంటిక్' సమీక్ష: రొమాన్స్ తక్కువ... రొటీన్ సీన్లు ఎక్కువ!
Also Read: 'ఫ్యామిలీ డ్రామా' సమీక్ష: థ్రిల్లింత కొంత... సుహాస్ నటన కొండంత!
Also Read: వరుడు కావలెను సమీక్ష: ఈ వరుడు చాలా రొటీన్ గురూ...
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి