Puneeth Rajkumar Death News Live Updates: కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్‌కుమార్ మరణంపై ప్రముఖుల దిగ్భ్రాంతి.. మోదీ ట్వీట్
కన్నడ హీరో పునీత్ రాజ్‌కుమార్ (46) ఇకలేరు. జిమ్ చేస్తుండగా గుండెపోటు రావడంతో హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. అప్పటికే పరిస్థితి విషమించిందని... పునీత్ తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారని సమాచారం.
ABP Desam Last Updated: 29 Oct 2021 04:46 PM
Background
కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ శుక్రవారం (అక్టోబర్ 29) గుండెపోటుకు గురయ్యారు. జిమ్ చేస్తున్న సమయంలో హార్ట్ ఎటాక్ వచ్చింది. దాంతో ఆయన్ను హుటాహుటిన బెంగళూరులోని విక్రమ్ ఆస్పత్రికి తరలించారు. అనుభవజ్ఞులైన వైద్యుల సమక్షంలో ప్రస్తుతం ఐసీయూలో చికిత్స...More
కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ శుక్రవారం (అక్టోబర్ 29) గుండెపోటుకు గురయ్యారు. జిమ్ చేస్తున్న సమయంలో హార్ట్ ఎటాక్ వచ్చింది. దాంతో ఆయన్ను హుటాహుటిన బెంగళూరులోని విక్రమ్ ఆస్పత్రికి తరలించారు. అనుభవజ్ఞులైన వైద్యుల సమక్షంలో ప్రస్తుతం ఐసీయూలో చికిత్స పొందుతున్నారు. మరోవైపు ఆయన మరణించాడని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. అందువల్ల... అభిమానులు, ప్రేక్షకులు ఆందోళనకు గురవుతున్నారు. పునీత్ రాజ్ కుమార్ వయసు 46 సంవత్సరాలే. ఓ గంట తర్వాత ఆరోగ్య పరిస్థితి గురించి వివరాలు వెల్లడిస్తామని వైద్యులు తెలియజేశారు. ప్రస్తుతం పరిస్థితి విషమంగా ఉన్నట్టు సమాచారం.పునీత్ రాజ్ కుమార్ ఆస్పత్రి పాలైన విషయం తెలిసిన వెంటనే... ఆయన్ను పరామర్శించడానికి ఆస్పత్రికి కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ వెళ్లారు. ఇంకా పలువురు కన్నడ హీరోలు, ప్రముఖులు ఆస్పత్రికి తరలి వెళ్తున్నారు. పెద్ద ఎత్తున అభిమానులు కూడా ఆస్పత్రి దగ్గరకు చేరుకుంటుంన్నారు. ఇప్పటికే చాలామంది అభిమానులు ఆస్పత్రికి వచ్చారు.పునీత్ రాజ్‌కుమార్ మరణవార్తతో కన్నడ చలన చిత్ర పరిశ్రమలో విషాద ఛాయలు అలుముకున్నాయి. కన్నడ ప్రేక్షకులు, అభిమానులు శోక సంద్రంలో మునిగిపోయారు. అయితే... రాజ్ కుమార్ కుటుంబ సభ్యులు ఇంకా పునీత్ మరణవార్తను అధికారికంగా ప్రకటించలేదు.పునీత్ మరణంపై టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. పునీత్ కుటుంబానికి చిరంజీవి ప్రగాఢ సానుభూతి తెలిపారు. చిన్న వయసులోనే పునీత్ కు ఇలా జరగడం తీవ్ర ఆవేదనకు గురి చేసింది. కన్నడ చిత్రపరిశ్రమకు పునీత్ మరణం తీరని లోటన్నారు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని ఆకాంక్షించారు. ఈ మేరకు ట్వీట్ చేశారు. పునీత్ మృతికి కేవలం శాండిల్ వుడ్ నుంచే కాక తెలుగు, తమిళ, మలయాళ, హిందీ సెలబ్రిటీలు సైతం సంతాపం వ్యక్తం చేస్తున్నారు. ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
ఇది చనిపోవాల్సిన వయసు కాదు: ప్రధాని నరేంద్ర మోదీ