Preity Zinta Blessed with Twins: ప్రీతిజింతాకు కవలలు, కానీ ఆమె కనలేదు

బాలీవుడ్ హీరోయిన్ ప్రీతిజింతా తల్లయ్యింది. ఆమెకు ఒక బాబు, పాప జన్మించారు.

Continues below advertisement

ప్రీతి జింతా బాలీవుడ్ హీరోయిన్ అయినా తెలుగు ప్రేక్షకులకు బాగా తెలిసిన నాయికే. వెంకటేష్‌తో ప్రేమంటే ఇదేరా, మహేష్ బాబుతో రాజకుమారుడు సినిమాల్లో నటించింది. ఆ రెండూ సినిమాలు సూపర్ హిట్టు కొట్టాయి. తరువాత ఆమె పూర్తిగా హిందీ సినిమాలకే పరిమితమైంది. 2016లో తన అమెరికన్ అయిన జీన్ గుడెనఫ్‌ని లాస్ ఏంజలస్‌లో పెళ్లి చేసుకుంది. అప్పట్నించి భర్తతో పాటూ అక్కడే సెటిలైంది. సినిమాలకు కూడా దూరంగా ఉంటూ వచ్చింది. 46 ఏళ్ల ప్రీతి జింతా తాను తల్లయినట్టు సోషల్ మీడియా ఖాతాల ద్వారా అభిమానులతో పంచుకుంది. కవలలు పుట్టారని ఆనందాన్ని పంచుకుంది. కొడుకు జై జింతా గుడెనఫ్, కూతురు జియా జింతా గుడెనఫ్ ఈ లోకంలోకి వచ్చారని సంబరంగా చెప్పింది. అయితే ప్రీతి జింతా వారిని కనలేదు. సరోగసీ పద్దతి ద్వారా ప్రీతి జంట కవలలకు జన్మనిచ్చారు.  

Continues below advertisement

తన ఇన్ స్టా ఖాతలో శుభవార్తను తొలిసారి పంచుకుని ప్రీతిజింతా. పిల్లల ఫోటోలు మాత్రం షేర్ చేయలేదు. తన భర్తతో ఉన్న ఫోటోను షేర్ చేసి ‘అందరికీ హాయ్, నేను మీతో ఒక అద్భుతమైన వార్తను పంచుకోబోతున్నాను. మా కొడుకు జై జింతా గుడెనఫ్, కూతురు జియా జింతా గుడెనఫ్ ... మా ఫ్యామిలీలోకి వచ్చినందుకు జీన్, నేను చాలా సంతోషిస్తున్నాము. మా జర్నీలో భాగమైన వైద్యులు, నర్సులు, సరోగేట్ మదర్ కు మనస్పూర్తిగా కృతజ్ఞతలు చెబుతున్నాము’ అని రాసుకొచ్చింది. నెటిజన్లంతా ఆమెకు కంగ్రాట్స్ చెప్పడంలో బిజీ అయిపోయారు. లక్షల మంది లైకులు కొట్టారు. 

Read Also: నాగ్ పంచ్‌కు చైతూ కౌంటర్.. ‘లేడిస్ ఫస్ట్’ అంటూ కృతిశెట్టి ఫస్ట్ లుక్ రిలీజ్!

Read Also: ‘శ్యామ్ సింగరాయ్’ టీజర్.. స్త్రీ ఎవడికీ దాసి కాదు.. ఆఖరికి ఆ దేవుడికి కూడా.. ఖబడ్దార్

Also Read: అప్‌క‌మింగ్ టాలెంట్‌కు ఛాన్స్ ఇచ్చిన‌ అల్లు అర్జున్... సమంతతో స్పెషల్ సాంగ్‌కు అతడే కొరియోగ్రాఫర్!
Also Read: రూపాయి పాపాయి లాంటిది.. పెంచి పెద్ద చేసుకోవాలి.. ఇంట్రెస్టింగ్‌గా ‘అనుభవించురాజా’ ట్రైలర్

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

Continues below advertisement