హీరో సూర్య తాజా సినిమా ‘జై భీమ్’. అమెజాన్ ప్రైమ్ లో విడుదలై ప్రేక్షకుల మనసులను హత్తుకుంది. నిజజీవిత కథ ఆధారంగా తీసిన ఈ సినిమా ఎంతో మంది ప్రశంసలను అందుకుంది. ఈ సినిమా హీరోనే కాదు నిర్మాత కూడా సూర్యనే. తమిళంతో పాటూ తెలుగు, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో ఒకేసారి విడుదలైంది. 1993లో జరిగిన యథార్థ జీవిత కథనే సినిమాగా తెరకెక్కించాడు సూర్య. చంద్రు అనే న్యాయవాది పార్వతి అనే గిరిజన తెగకు చెందిన మహిళకు అండగా నిలిచి, ఆమె భర్త మరణం వెనుక రహస్యాన్ని చేధించడమే కథ. పార్వతి భర్త రాజకన్ను పోలీస్ కస్టడీలోనే మరణించాడని నిరూపించేందుకు చంద్రు పడిన కష్టాన్ని సూర్య సినిమాలో చూపించారు. కాగా ఈ సినిమాలో తమ వర్గాన్ని కించపరిచారంటూ వన్నియర్ సంఘం ఆరోపించింది. అంతేకాదు చిత్రయూనిట్ కు లీగల్ నోటీసులు కూడా పంపింది. 


అంతటితో ఆగలేదు ఆ సంఘం నాయకులు. సూర్యను ఎవరైనా కొడితే లక్షరూపాయల రివార్డు ఇస్తామని ప్రకటించింది. ఈ వివాదాస్పద వ్యాఖ్యలు తమిళనాడ సంచలనంగా మారాయి. అంతేకాదు సూర్యకు వ్యక్తిగతంగా కూడా బెదిరింపులు వచ్చినట్టు సమాచారం. ఈ నేపథ్యంలో పోలీసులు సూర్య ఇంటికి భద్రత కల్పించారు. చెన్నైలోని ఆయన నివాసం చుట్టూ భారీగా బందోబస్తును ఏర్పాటు చేశారు. సూర్యను ఇంట్లోనే ఉండమని కోరారు పోలీసులు. పళని సామి అనే వ్యక్తి సూర్యను కొడితే డబ్బులిస్తానంటూ వ్యాఖ్యలు చేశాడు... అతడిపై పోలీసుల కేసునమోదు చేశారు. 


సూర్యకు పెరుగుతున్న మద్దతు
కేవలం వన్నియర్ వర్గం వారు మాత్రమే సూర్యను, జై భీమ్ సినిమాను వ్యతిరేకిస్తున్నారు. మిగతా వర్గాలు సినిమాకు, సూర్యకు చాలా మద్దతుగా నిలుస్తున్నారు. సోషల్ మీడియా వేదికగా సూర్యకు మద్దతు పెరుగుతోంది. ‘వి స్టాండ్ విత్ సూర్య’ పేరుతో హ్యాష్ ట్యాగ్ ట్రెండ్ అవుతోంది. తెలంగాణాకు చెందిన కాంగ్రెస్ ఎమ్మెల్యే సీతక్క కూడా సినిమాను మెచ్చుకుంటూ ట్వీట్ చేశారు. తమిళనాడు సీఎం స్టాలిన్ కూడా ప్రత్యేకంగా మెచ్చుకున్నారు. 






Also Read: రెండు రాష్ట్ర ప్రభుత్వాలు ఆ విషయం మర్చిపోయాయ్.. చిరు వ్యాఖ్యలు
Also Read: మోహన్ బాబు ఇంట్లో విషాదం.. పునీత్ భార్య ఎమోషనల్ పోస్ట్..
Also Read: ‘స్పైడర్ మ్యాన్ - నో వే హోమ్’ తెలుగు ట్రైలర్ వచ్చేసింది.. అన్ని విశ్వాల విలన్లతో భారీ పోరు!
Also Read: అప్‌క‌మింగ్ టాలెంట్‌కు ఛాన్స్ ఇచ్చిన‌ అల్లు అర్జున్... సమంతతో స్పెషల్ సాంగ్‌కు అతడే కొరియోగ్రాఫర్!
Also Read: రూపాయి పాపాయి లాంటిది.. పెంచి పెద్ద చేసుకోవాలి.. ఇంట్రెస్టింగ్‌గా ‘అనుభవించురాజా’ ట్రైలర్


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి