పవన్ కళ్యాణ్-క్రిష్ కాంబినేషన్లో తెరకెక్కుతోన్న మూవీ 'హరి హర వీరమల్లు'. ఇది పవన్ నటిస్తున్న తొలి చరిత్రాత్మక చిత్రం మాత్రమే కాదు..కెరీర్లోనే అత్యధిక బడ్జెట్‌తో అత్యున్నత సాంకేతిక విలువలతో రూపొందుతున్న సినిమా. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ – గ్లిమ్స్ ఓ రేంజ్‌లో ఉన్నాయి. బందిపోటుగా పవన్ లుక్ అదుర్స్ అనిపించింది. అయితే పవన్ బర్త్ డే సందర్భంగా ఏం చేస్తారా అనే ఆలోచనలో ఉన్న అభిమానులకు ఆ సినిమా రిలీజ్ డేట్ ఫిక్స్ చేస్తూ పోస్టర్ ట్వీట్ చేశాడు దర్శకుడు క్రిష్.



‘హరిహర వీరమల్లు’ నుంచి కొత్త పోస్టర్ అయినా, టీజర్ అయినా వస్తుందని భావించిన ఫ్యాన్స్‌కు కాస్త నిరాశే అయినప్పటికీ డేట్ పక్కాగా చెప్పడం కాస్త సంతోషం అంటున్నారు. 'భీమ్లా నాయక్' సంక్రాంతి బరిలో దిగుతుండగా.. సమ్మర్‌లో కేవలం మూడు నెలల విరామంలో 2022 ఏప్రిల్ 29న ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు ప్రకటించారు. అంటే 'కేజీయఫ్ 2' రిలీజ్ అయిన 2 వారాలకు వీరమల్లు వచ్చేస్తాడన్నమాట.


కోహినూర్ వజ్రం నేపథ్యంలో మొఘలాయిల కాలం నాటి కథతో ఈ సినిమా రూపొందుతోంది. పవన్ కళ్యాణ్ సరసన ఇస్మార్ట్ బ్యూటీ నిధి అగర్వాల్, బాలీవుడ్ భామ జాక్వెలిన్ ఫెర్నాండేజ్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. హిందీ నటుడు అర్జున్ రామ్ పాల్, మలయాళ నటుడు జయరామ్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. కీరవాణి మ్యూజిక్ డైరెక్టర్. తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో ఈ చిత్రాన్ని విడుదల చేయబోతున్నారు.


Also Read: పవన్ బర్త్ డే సందర్భంగా దేవిశ్రీప్రసాద్ ఇచ్చిన గిఫ్ట్ చూశారా?




Also Read: చూడప్ప సిద్దప్ప…నేనొక మాట చెప్తాను..పనికొస్తే ఈడ్నే వాడుకో లేదంటే ఏడ్నైనా వాడుకో..పవర్ కళ్యాణ్ సూపర్ హిట్స్, పవర్ స్టార్ పవర్ ఫుల్ డైలాగ్స్



ఇక భీమ్లానాయక్, హరిహరవీరమల్లు తర్వాత హరీశ్ శంకర్, సురేందర్ రెడ్డి లైన్లో ఉన్నారు. అయితే గతేడాది పవర్ స్టార్ కి బర్త్ డే సందర్భంగా ఈ ప్రాజెక్ట్ ని అధికారికంగా ప్రకటించిన సురేందర్ రెడ్డి..ఈ ఏడాది కొత్త పోస్టర్ తో వచ్చాడు. 'యథా కాలమ్.. తథా వ్యవహారమ్' అంటూ సంస్కృతంలోని లైన్స్ తో పవన్ బర్త్ డే స్పెషల్ పోస్టర్ ని డిజైన్ చేశారు. ఇందులో ఓవైపు గన్ మరోవైపు హైదరాబాద్ నగరాన్ని చూపిస్తున్నారు. ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్ట్ కోసం పవన్ కళ్యాణ్ తో అసోసియేషన్ అవడం గర్వకారణమని మేకర్స్ పేర్కొన్నారు. SRT ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై ప్రొడక్షన్ నెం.9 గా పవన్ –సురేందర్ రెడ్డి ప్రాజెక్ట్ రూపొందనుంది. పవన్ కు సన్నిహితుడైన రామ్ తాళ్లూరి ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. వక్కంతం వంశీ ఈ చిత్రానికి కథ అందిస్తున్నారు.






ఈ సినిమాల తర్వాత పవన్ కళ్యాణ్ హరీష్ శంకర్ దర్శకత్వంలో నెక్ట్స్ మూవీ చేయనున్నాడు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన అఫీషియల్ ప్రకటన కూడా చేశారు. తాజాగా పవన్ కళ్యాణ్ బర్త్ డే సందర్భంగా పవన్ కళ్యాణ్ బైక్ పై కూర్చొని బ్యారెల్ గన్‌ను లోడ్ చేస్తున్న ప్రీ లుక్‌ను విడుదల చేశారు. ఈ లుక్‌లో ఫుల్లీ లోడెడ్ అంటూ మరోసారి ఎంటర్‌టైన్మెంట్‌కు సిద్ధంగా ఉండండి అంటూ హరీష్ శంకర్ అభిమానులకు పిలుపిచ్చాడు.


Also Read: పవన్ కళ్యాణ్ బర్త్‌ డే స్పెషల్.. జనంలో ఉంటాడు.. జనంలా ఉంటాడు, ఇదీ పవర్ స్టారంటే!


Also Read:పవన్ కళ్యాణ్ సేఫ్ జర్నీ.. రిమేక్ సినిమాలే బెటర్ అనుకుంటున్న పవర్ స్టార్?