పవన్ కళ్యాణ్ కోసం స్క్రిప్ట్ రెడీ - ఎప్పటికైనా సినిమా చేసి తీరుతా, మెహర్ రమేష్ షాకింగ్ కామెంట్స్!
టాలీవుడ్ ప్లాప్ చిత్రాల దర్శకుడు మెహర్ రమేష్ తాజాగా చేసిన కామెంట్స్ తో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ షాక్ కి గురవుతున్నారు. ప్రస్తుతం మెహర్ రమేష్ చేసిన కామెంట్స్ సోషల్ మీడియా అంతటా వైరల్‌గా మారుతున్నాయి. 'భోళా శంకర్' డిజాస్టర్ అవడంతో మీడియాలో కానీ ఇతర ఈవెంట్లలో కానీ ఎక్కడా కనిపించని మెహర్ రమేష్ తాజాగా ఓ ఇంటర్వ్యూ ఇచ్చాడు. ఆ ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలు వెల్లడించారు. ఒకరోజు తాను పవన్ కళ్యాణ్‌తో సినిమా చేస్తానని, కచ్చితంగా ఎప్పటికైనా ఆ సినిమా చేసి తీరుతానని అన్నాడు. అంతేకాకుండా తన దగ్గర పవన్ కళ్యాణ్ కోసం రెడీ చేసుకున్న ఓ కథ ఎప్పటినుంచో ఉందని, స్క్రిప్ట్ కూడా రెడీ చేశానని, కచ్చితంగా ఆ కథతో పవన్ కళ్యాణ్ ని హీరోగా పెట్టి సినిమా చేస్తానని మెహర్ రమేష్ చెప్పుకొచ్చాడు. దీంతో ఈ కామెంట్స్ విన్న పవన్ ఫ్యాన్స్ షాక్ అవుతున్నారు. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.)


అప్పుడే ఓటీటీలోకి వచ్చేస్తున్న 'జిగర్తాండ డబుల్ ఎక్స్' - స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
కోలీవుడ్ హీరో రాఘవ లారెన్స్, ఎస్. జె సూర్య ప్రధాన పాత్రల్లో నటించిన 'జిగర్తాండ డబుల్ ఎక్స్' మూవీ ఓటీటీ స్ట్రీమింగ్ కి రెడీ అయింది. విడుదలై నెలరోజులు అవ్వకుండానే ఈ సినిమా ఓటీటీలోకి రాబోతుండడం గమనార్హం. ఇంతకీ 'జిగర్తాండ డబుల్ ఎక్స్' ఓటీడీ రిలీజ్ ఎప్పుడు? డీటెయిల్స్ లోకి వెళ్తే.. కోలీవుడ్ డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వంలో రాఘవ లారెన్స్, ఎస్. జె సూర్య ప్రధాన పాత్రలో నటించిన చిత్రం 'జిగర్తాండ డబల్ ఎక్స్'. 2014లో వచ్చిన 'జిగర్తాండ' అనే సినిమాకి ఇది సీక్వెల్ గా తెరకెక్కింది. సిద్ధార్థ్, బాబీసింహ లీడ్ రోల్స్ ప్లే చేసిన ఈ చిత్రం అప్పట్లో బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. వచ్చే శుక్రవారం అంటే డిసెంబర్ 8 నుంచి ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫాం నెట్ ఫ్లిక్స్ లో 'జిగర్తాండ డబుల్ ఎక్స్' మూవీ స్ట్రీమింగ్ కానుంది. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.)


'బచ్చలమల్లి'గా అల్లరి నరేష్ - ఆసక్తి రేకెత్తిస్తోన్న పోస్టర్, గజదొంగగా కనిపించనున్న అల్లరోడు!
#Naresh62 అనే వర్కింగ్ టైటిల్ తో తన పుట్టినరోజు సందర్భంగా గతంలో ఈ ప్రాజెక్టుకు సంబంధించి అనౌన్స్మెంట్ పోస్టర్ రిలీజ్ చేయగా తాజాగా మూవీ టీం టైటిల్ ని రివీల్ చేసింది. అల్లరి నరేష్ కెరీర్లో 62వ సినిమాగా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి 'బచ్చలమల్లి' అనే టైటిల్ ఫిక్స్ చేశారు. ఇందుకు సంబంధించి ఓ పోస్టర్ కూడా రిలీజ్ చేశారు. టైటిల్ తోనే సినిమాపై క్యూరియాసిటీ పెరిగింది. ఇంతకీ 'బచ్చలమల్లి' అనే టైటిల్ లో ఉన్న వ్యక్తి పేరు ఎవరిది? ఈ ప్రాజెక్టుకి ఆ టైటిల్ కి ఉన్న సంబంధం ఏంటి? అనే విషయానికొస్తే.. 1990లో ఆంధ్రప్రదేశ్ ప్రాంతంలోని తునిలో గజదొంగగా పేరుగాంచిన బచ్చలపల్లి జీవిత కథనే సినిమాగా తెరకెక్కిస్తున్నారు. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.)


యానిమల్ రివ్యూ: ఇంటర్వెల్‌కే క్లైమాక్స్ 'హై' ఇచ్చిన రణబీర్, సందీప్ రెడ్డి వంగా - మరి, ఆ తర్వాత?
'యానిమల్' సినిమాపై తెలుగు రాష్ట్రాల్లోనూ క్రేజ్ నెలకొనడానికి కారణం దర్శకుడు సందీప్ రెడ్డి వంగా! తెలుగులో ఆయన తీసిన 'అర్జున్ రెడ్డి' సినిమా! సందీప్ రెడ్డి వంగాకు రణబీర్ కపూర్ లాంటి టాలెంటెడ్ హీరో తోడు కావడంతో సినిమాపై ముందు నుంచి అంచనాలు ఏర్పడ్డాయి. మరి, సినిమా ఎలా ఉంది? (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.)


దూత రివ్యూ: అమెజాన్‌లో నాగ చైతన్య ఫస్ట్ వెబ్ సిరీస్ - బావుందా? బాలేదా?
దర్శకుడు విక్రమ్ కె కుమార్ శైలి వేరు. '13బి', 'ఇష్క్', 'మనం', '24' వంటి మెమరబుల్ ఫిల్మ్స్ ఇచ్చారు. ఆయన తొలిసారి దర్శకత్వం వహించిన వెబ్ సిరీస్ 'దూత'. ఇందులో అక్కినేని నాగ చైతన్య హీరోగా నటించడం మరో స్పెషాలిటీ. '13బి' తర్వాత సూపర్ నేచురల్ జానర్ మరోసారి టచ్ చేశారు విక్రమ్ కె కుమార్. అతీంద్రియ శక్తుల నేపథ్యంలో ఆయన తీసిన 'దూత' ఎలా ఉంది? (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.)