ప్రముఖ బాలీవుడ్ నటి శిల్పాశెట్టి భర్త రాజ్ కుంద్రాను పోర్నోగ్రఫీ కేసులో పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఈ కేసులో శిల్పాశెట్టిని కూడా పోలీసులు విచారించారు. ఇప్పటివరకు అయితే ఈ పోర్నోగ్రఫీ కేసులో ఆమె ప్రమేయం లేదని తెలుస్తోంది. అయినప్పటికీ పోలీసులు ఈ కోణంలో విచారణ జరిపిస్తూనే ఉన్నారు. అయితే తాజాగా శిల్పాశెట్టి, ఆమె తల్లి సునందపై లక్నోలోని రెండు పోలీస్ స్టేషన్స్ లో చీటింగ్ కేసు నమోదైంది. 


శిల్పా శెట్టి, ఆమె తల్లి సునంద శెట్టి తమ వద్ద కోట్ల రూపాయలు తీసుకొని మోసం చేశారంటూ జ్యోత్స్న చౌహన్, రోహిత్ వీర్ సింగ్ అనే ఇద్దరు వ్యక్తులు హజరత్‌గంజ్, విభూతిఖండ్‌ పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టారు. వారి ఫిర్యాదుల మేరకు పోలీసులు రెండు బృందాలుగా ఏర్పడి విచారణ చేపట్టాడు.


ఈ రెండు బృందాలను డీసీపీ సంజీవ్ సుమన్ లీడ్ చేస్తున్నారు. ఇప్పటికే శిల్పాశెట్టిని, ఆమె తల్లిని విచారించడానికి ఓ బృందం ముంబై చేరుకుంది. అందుతున్న సమాచారం ప్రకారం.. శిలాశెట్టి అయోసిస్ వెల్ నెస్ అండ్ స్పా పేరుతో ఫిట్ నెస్ సెంటర్ ను నడిపిస్తున్నారు. దీనికి ఆమె చైర్మన్ గా బాధ్యతలు నిర్వర్తిస్తుంటే.. ఆమె తల్లి సునంద డైరెక్టర్ గా వ్యవహరిస్తున్నారు. 


ఈ క్రమంలో ఫిట్ నెస్ సెంటర్ కు సంబంధించిన మరో బ్రాంచ్ ను లక్నోలో మొదలుపెట్టడానికి జ్యోత్స్న చౌహాన్, రోహిత్ వీర్ సింగ్ అనే ఇద్దరికి ఫ్రాంచైజ్ ఇచ్చి.. సెంటర్ ను మొదలుపెట్టడానికి వారి నుండి కోట్ల రూపాయలు తీసుకున్నారు. ఆ తరువాత నుండి శిల్పాశెట్టి అండ్ కో నుండి ఎలాంటి రెస్పాన్స్ లేకపోవడంతో మోసపోయామని గ్రహించి బాధితులు పోలీసులను ఆశ్రయించారు. దీంతో శిలాశెట్టి, ఆమె తల్లి సునంద శెట్టిలపై చీటింగ్ కేసు నమోదైంది. పోలీసులు అన్ని కోణాల్లో ఈ కేసుని దర్యాప్తు చేస్తున్నారు.  ఈ విషయం ఉన్నత స్థాయికి చేరిందని.. అందువల్ల పోలీసులు అన్ని అంశాలను నిశితంగా పరిశీలిస్తున్నారని డీసీసీ సంజీవ్‌ సుమన్‌ తెలిపారు. 


Also Read : Raj Kundra : రాజ్ కుంద్రాకు బెయిల్ నిరాకరించిన బాంబే హైకోర్టు


Shilpa Shetty Salary: రాజ్ కుంద్రా ఎఫెక్ట్.. శిల్పాశెట్టికి రూ.2 కోట్ల నష్టం..


Shilpa Shetty Statement: తప్పుడు వార్తలు ప్రచారం చేయకండి.. శిల్పాశెట్టి ఫైర్


Raj Kundra Case: శిల్పాశెట్టి ఇమేజ్‌కు పెద్ద దెబ్బ.. రూ.25 కోట్ల పరువు నష్టం దావా!