నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీను కలయికలో రూపొందుతోన్న తాజా సినిమా 'అఖండ'. నందమూరి అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తోన్న ఈ సినిమా ట్రైలర్ ను ఆదివారం సాయంత్రం విడుదల చేశారు. మాస్, యాక్షన్ ఎలిమెంట్స్ తో కూడిన ట్రైలర్ ఓ రేంజ్ లో ఉంది. బాలయ్య ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు. 


Also Read: అటెన్షన్ కోసం నా ఇమేజ్ డ్యామేజ్ చేస్తున్నారు.. శిల్పాశెట్టి రియాక్షన్


''విధికి, విధాతకు, విశ్వానికి సవాళ్లు విసరకూడదు..''అనే డైలాగ్ తో ట్రైలర్ మొదలైంది. ఆ తరువాత మొత్తం మాస్ సీన్స్ తో ట్రైలర్ ని నింపేశారు. ''అంచనా వేయడానికి నువ్వేమైనా.. పోలవరం డ్యామా..? పట్టిసీమ తూమా.. పిల్లకాలువ'' అంటూ బాలయ్య చెప్పే డైలాగ్ ఆకట్టుకుంటుంది.


''ఒక మాట నువ్వంటే అది శబ్దం.. అదే మాట నేనంటే శాసనం.. దైవశాసనం'', ''మీకు సమస్యం వస్తే దండం పెడతారు.. మేం ఆ సమస్యకు పిండం పెడతాం.. బోత్ ఆర్ నాట్ సేమ్'' అంటూ అఘోరా గెటప్ లో బాలయ్య చెప్పే డైలాగ్స్ ఎంతో పవర్ ఫుల్ గా ఉంది. ''ఒకసారి డిసైడ్ అయి బరిలోకి దిగితే బ్రేకుల్లేని బుల్ డోజర్ ని తొక్కి పారదొబ్బుతా..'' అంటూ చెప్పే మరో డైలాగ్ మాస్ ఆడియన్స్ కు బాగా కనెక్ట్ అవుతుంది. 
ట్రైలర్ లో శ్రీకాంత్ మాస్ గెటప్ మాములుగా లేదు. అలానే జగపతిబాబుకి కూడా మంచి ఎలివేషన్ ఇచ్చారు. ఆయన చెప్పే డైలాగ్ కూడా హైలైట్ గా నిలిచింది. 


'సింహా', 'లెజెండ్' వంటి సినిమాల బాలయ్య-బోయపాటి కాంబినేషన్ లో వస్తోన్న సినిమా కావడంతో ఈ సినిమాపై భారీ అంచనాలునెలకొన్నాయి. వీటికి తోడు ఇప్పటికే విడుదలైన పాటలు కూడా ప్రేక్షకుల్ని ఆకట్టుకున్నాయి. ఇందులో బాలయ్యకు జోడీగా ప్రగ్యా జైస్వాల్ కనిపించనుంది. ద్వారకా క్రియేషన్స్ పతాకంపై మిర్యాల రవీందర్‌ రెడ్డి నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి.  డిసెంబర్ 2న ఈ సినిమాను విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. 






Also Read: మెగాస్టార్ సినిమా నుంచి తప్పుకున్నాడా..? తప్పించారా..?


Also Read: మోహన్ లాల్ కి జోడీగా మంచువారమ్మాయి..


Also Read: 'పుష్ప'లో సమంత ఐటెం సాంగ్.. బన్నీతో మాస్ డాన్స్ కి రెడీ..


Also Read: కోర్టుకు వెళ్లే ఆలోచ‌న లేదు... ఏపీ సీఎం జ‌గ‌న్మోహ‌న్‌రెడ్డితో మాట్లాడ‌తాం! - 'ఆర్ఆర్ఆర్' నిర్మాత


Also Read: పునీత్ రాజ్‌ కుమార్‌ కళ్లతో... మరో పది మందికి చూపు!


Also Read: ఈ వారం కాజల్ సేఫ్.. పాపం అతడు ఎలిమినేట్ అవ్వక తప్పడం లేదు..


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి