బిగ్ బాస్ సీజన్ 5 పదో వారం పూర్తి చేసుకోబోతుంది. ఇప్పటివరకు మొత్తం తొమ్మిది మంది కంటెస్టెంట్స్ ఎలిమినేట్ కాగా.. ఈ వారం ఎలిమినేషన్ కు ఐదుగురు కంటెస్టెంట్స్ నామినేట్ అయ్యారు. సిరి, కాజల్, మానస్, సన్నీ, రవి.. ఈ ఐదుగురిలో కాజల్ ఎలిమినేట్ అవ్వక తప్పదని వార్తలొచ్చాయి.  అందరికంటే ఆమెకి తక్కువ ఓట్లు పడుతున్నాయని.. కాబట్టి ఈ వారం ఆమె ఎలిమినేట్ అవుతుందని అన్నారు. కానీ అందుతున్న సమాచారం ప్రకారం.. కాజల్ సేవ్ అయినట్లు తెలుస్తోంది. 

 


 

దానికి కారణం జెస్సీ. కొన్నిరోజులుగా జెస్సీ ఆరోగ్యం బాలేకపోవడంతో.. అతడిని హౌస్ నుంచి బయటకు పంపించి ట్రీట్మెంట్ ఇప్పించారు బిగ్ బాస్. అనంతరం హౌస్ లోకి పంపించకుండా.. క్వారెంటైన్ లో భాగంగా సీక్రెట్ రూమ్ లో ఉంచారు. ఈ వారం సీక్రెట్ రూమ్ లో ఉండి గేమ్ చూసిన జెస్సీకి మళ్లీ ఆరోగ్యం దెబ్బతింది. తనకు వెర్టిగో ఎక్కువైందని.. చాలా ఇబ్బందిగా ఉందని జెస్సీ.. బిగ్ బాస్ కి చెప్పడంతో వెంటనే డాక్టర్స్ ని పిలిపించారు బిగ్ బాస్. జెస్సీని పరీక్షించిన వైద్యులు అతడిని హాస్పిటల్ కు తీసుకెళ్లి ట్రీట్మెంట్ ఇవ్వాలని చెప్పారు. 

 

కాబట్టి అతడిని ఎక్కువరోజులు సీక్రెట్ రూమ్ లో ఉంచడం కుదరడం లేదు. జెస్సీ అనారోగ్యం కారణంగా అతడిని హౌస్ నుంచి బయటకు పంపించేయాలని నిర్ణయించుకుంది బిగ్ బాస్ టీమ్. దీంతో ఈ వారం అతడిని ఎలిమినేట్ చేయబోతున్నారు. కాబట్టి నామినేషన్ లో ఉన్న ఐదుగురు సేవ్ అయినట్లే. ఈ వారం ఎలిమినేషన్ ప్రాసెస్ ఉండదని తెలుస్తోంది. మొత్తానికి జెస్సీ ఎలిమినేషన్ మిగిలిన హౌస్ మేట్స్ కి కలిసొచ్చినట్లే ఉంది. 

 

కానీ జెస్సీ తిరిగి హౌస్ లోకి వస్తాడని చూస్తున్న సిరి, షణ్ముఖ్ లకు నిరాశ తప్పదేమో. నిజానికి జెస్సీ తన గేమ్ బాగానే ఆడుతున్నాడు. నామినేషన్ లో ఉన్న ప్రతీసారి అతడిని ప్రేక్షకులు సేవ్ చేస్తూ వచ్చారు. ఈ వారం అతడు నామినేషన్ లో లేకపోయినా.. ఎలిమినేట్ అవ్వక తప్పడం లేదు. బిగ్ బాస్ సీజన్ 4 లో నోయెల్ కి కూడా ఇలానే ఆరోగ్య సమస్యలు రావడంతో అతడిని కూడా ఎలిమినేట్ చేసేశారు. ఇప్పుడు జెస్సీ విషయంలో కూడా అదే రిపీట్ అవుతోంది. 

 



Also Read:అమెరికాలో విజయ్ దేవరకొండ.. పూరితో చిల్ అవుతూ..


Also Read: బాలయ్య షోకి గెస్ట్ గా సెన్సేషనల్ హీరో.. రచ్చ మాములుగా ఉండదేమో..


Also Read: జనవరిలో మహేష్ బాబు రావడం లేదు. కానీ, ఆయన మేనల్లుడు వస్తున్నాడోచ్


Also Read: ప్రభాస్, పూజా హెగ్డే షి'కారు'... అదీ సముద్రంలో! ఈ రాతలే... రాధే శ్యామ్!


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి