రైటర్ గా కెరీర్ మొదలుపెట్టిన కొరటాల శివ 'మిర్చి' సినిమాతో దర్శకుడిగా మారారు. మొదటిసినిమాతోనే భారీ విజయాన్ని అందుకున్నారు. దర్శకుడిగా ఆయన ఇప్పటివరకు చేసిన నాలుగు సినిమాలు.. నాలుగు ఇండస్ట్రీ హిట్లు. ప్రస్తుతం ఆయన డైరెక్ట్ చేసిన 'ఆచార్య' సినిమా వచ్చే ఏడాది ఫిబ్రవరిలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. చిరంజీవి, రామ్ చరణ్ కలిసి నటించిన సినిమా కావడంతో మెగాఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇక ఈ సినిమా తరువాత ఎన్టీఆర్ ని డైరెక్ట్ చేయబోతున్నారు కొరటాల.
ఇదిలా ఉండగా.. కొరటాల లిస్ట్ లో హీరో బాలయ్య కూడా ఉన్నట్లు సమాచారం. ఇండస్ట్రీలో ఉన్న అగ్ర హీరోలతో సినిమాలు చేయాలని ఫిక్స్ అయ్యారు కొరటాల శివ. త్వరలోనే బాలకృష్ణతో ఓ సినిమా చేయడానికి రంగం సిద్ధం చేసుకుంటున్నట్లు సమాచారం. బాలయ్య మాత్రం చేయదగిన కథ.. కొరటాల శివ దగ్గర రెడీగా ఉందట. దాన్ని బాలయ్యతోనే పట్టాలెక్కించాలని చూస్తున్నాడు. కొరటాల లాంటి డైరెక్టర్ తనతో సినిమా చేస్తానంటే.. బాలయ్య నో చెప్పే ఛాన్స్ లేదు.
కాబట్టి వీరిద్దరి కాంబినేషన్ లో సినిమా ఖాయమనిపిస్తుంది. కానీ అటు బాలయ్యకు, ఇటు కొరటాల శివకు ఇద్దరికీ వరుస కమిట్మెంట్స్ ఉన్నాయి. అవన్నీ పూర్తి చేసుకొని ఇద్దరూ ఒకే సమయానికి ఖాళీ అవ్వాలి. అప్పుడు కానీ ఈ ప్రాజెక్ట్ పట్టాలెక్కదు. ఇటీవల ఓ స్టార్ ప్రొడ్యూసర్ కొరటాల శివని కలిసి తనతో సినిమా చేయమని అడిగారట. అప్పుడు కొరటాల.. బాలయ్య కథ ప్రస్తావన తీసుకురావడంతో ఈ విషయం బయటకొచ్చింది.
ప్రస్తుతం బాలయ్య నటించిన 'అఖండ' సినిమా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతోంది. దీని తరువాత గోపీచంద్ మలినేని దర్శకత్వంలో మరో మాస్ కమర్షియల్ సినిమాలో నటించబోతున్నారు బాలయ్య. త్వరలోనే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలుకానుంది. ఈ సినిమాలో శృతిహాసన్ హీరోయిన్ గా కనిపించనుంది.
Also Read:అమెరికాలో విజయ్ దేవరకొండ.. పూరితో చిల్ అవుతూ..
Also Read: బాలయ్య షోకి గెస్ట్ గా సెన్సేషనల్ హీరో.. రచ్చ మాములుగా ఉండదేమో..
Also Read: జనవరిలో మహేష్ బాబు రావడం లేదు. కానీ, ఆయన మేనల్లుడు వస్తున్నాడోచ్
Also Read: వీవీ వినాయక్ క్లాప్‌తో... బాలకృష్ణ107వ సినిమా షురూ
Also Read: ప్రభాస్, పూజా హెగ్డే షి'కారు'... అదీ సముద్రంలో! ఈ రాతలే... రాధే శ్యామ్!
Also Read: బాలకృష్ణ కాపాడిన ప్రాణం... బాలకృష్ణ ముందుకు తీసుకొచ్చిన నాని
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి