ఈరోజు బిగ్ బాస్ ఎపిసోడ్ కి సంబంధించిన ప్రోమో వచ్చింది. అందులో నాగార్జున హౌస్ మేట్స్ తో ఓ గేమ్ ఆడించినట్లు ఉన్నారు. పోలీస్ డ్రెస్ వేసుకొని.. తమకు ఇష్టంలేని వ్యక్తిని జైల్లో పెట్టి.. దానికి రీజన్స్ చెప్పమని చెప్పినట్లు ఉన్నారు నాగ్. ముందుగా సన్నీని జైల్లో పెట్టిన రవి.. వెరీ బ్యాడ్ బిహేవియర్, ఇష్టమొచ్చినట్లు మాట్లాడేస్తాడు.. ఇస్తమొచ్చింది చేస్తా అంటున్నాడు.. నా దృష్టిలో అది తప్పని చెప్పాడు. ఏం పదాలు వాడాడు చెప్పు అంటూ మానస్ అడగడంతో.. 'తంతా' అనే పదం వచ్చిందా రాలేదా.. మీ నోటి నుంచి అని అడిగాడు రవి. 


Also Read: బాలయ్య షోకి గెస్ట్ గా సెన్సేషనల్ హీరో.. రచ్చ మాములుగా ఉండదేమో..


'ఎవరిని తంతా అన్నాను..' అని ఇన్నోసెంట్ గా అడిగాడు సన్నీ. 'ఎవరినో అన్నావ్ అని కాదు.. తంతా అనే వర్డ్ వాడావా..?' అని అడిగారు నాగార్జున. లేదు సార్ అని చెప్పాడు సన్నీ. మళ్లీ రవి మానస్ ని అడిగాడు.. ఆ వర్డ్ యూజ్ చేశాడా లేదా అని.. నేనైతే వినలేదని చెప్పాడు మానస్. వెంటనే నాగ్ వీడియో వేసి చూపించగా.. అందులో సన్నీ తంతా అని అన్నాడు. అది చూసిన సన్నీ తను 'బ్రిక్స్'నే అన్నానని చెప్పగా.. కంప్లీట్లీ రాంగ్ సార్ అని సిరి చెప్పింది. 


'నిన్నే అమ్మేస్తానని కూడా బ్రిక్స్ నే అన్నావా..?' అని ప్రశ్నించారు నాగార్జున. అసలు అమ్ముతాననే వర్డ్ నేను యూజ్ చేయలేదు సార్ అని చెప్పాడు సన్నీ. వెంటనే యానీ.. 'ఆయన కోపంలో చెప్తాడు కానీ.. సిరిని అనాలని ఇంటెన్షన్ కాదు సార్' అని చెప్పింది. దానికి నాగ్ 'అంటే యానీ కోపంలో ఏమన్నా ఓకేనా..?' అని అడిగారు. దాని యానీ తెల్లమొహం వేసింది. దీనిబట్టి ఈరోజు ఎపిసోడ్ చాలా రసవత్తరంగా సాగబోతుందని తెలుస్తోంది.